Monday, November 25, 2024

అస్త్రశస్త్ర మహౌగ్ర విన్యాసం రామ-రావణ యుద్ధం!

కుమారుడు ఇంద్రజిత్‌ను లక్ష్మణుడు చంపాడని తెలుసుకున్న రావణుడు ఒక్కసారిగా క్రుద్ధుడైనా డు. ఆయనకు కనీసం కళ్లవెంట నీరుకూడా రాలే దు. కాని ఇలా అను కున్నాడు. ఒకోసారి దేవతలకూ మర ణం తప్పదు అని సరిపెట్టుకున్నాడు. పరాక్రముడైన ఇంద్ర జిత్‌ కూడా అలా విధివశాన మృతి చెందాడని సరిపెట్టుకు న్నాడు. అయినా అతనిలో పశ్చాత్తాపం కనపడలేదు. తాను సీతను బలవంతంగా తీసుకురావడం వల్ల వీరందరూ యుద్ధంలో అసువులు బాస్తున్నారనే కనీస స్పృహ కలగలేదు. దీనికి కారణం సీత అని నిందిస్తూ ఆమెను నా కరావలా నికి బలి ఇస్తానని కత్తి తీసుకుని అశోకవనానికి బయలుదేరా డు. అతని ఆవేశం చూసి సీత అయ్యో నేను హనుమతో వెళ్లలేకపోయానేనని వగచింది. ఇలా ఈ దుష్టుడు రావణు ని చేతిలో మరణం పొందడం తన ఖర్మగా భావించింది. ఇంతలో రావణుని మంత్రి మహాపాశ్యుడు అతన్ని వారిం చాడు. రావణా! ఇన్ని శాస్త్రాలు చదివి చివరకు ఒక ఆడదా న్ని చంపుతావా అని ప్రశ్నించాడు. నీకు శత్రువు రాముడు కానీ సీత కాదు కదా అన్నాడు. అతన్ని యుద్ధంలో వధించు అన్నాడు. అసలు ఎప్పుడూ ఎవరి మాటలు వినని రావణు డు ఎందుకో మంత్రి మాటలు విని సీతను చంపే ప్రయత్నం విరమించి యుద్ధానికి బయలుదేరాడు. భీకరంగా శస్త్రాల ను వేసి వానరులను సంహరిస్తున్నాడు.
రావణుని ప్రతాపానికి పీనుగుల కుప్పలు లేచాయి. రావణుని పరాక్రమానికి భయపడ్డ వానర వీరులు రాముడి ని శరణువేడారు. దాంతో రాముడు రావణునిని ఎదుర్కోవ డానికి సిద్ధపడ్డాడు. రాముడు ధనస్సు వింటి నారితో ఠంకా రం చేసాడు. దాంతో ఒక్కసారిగా భూమి ఆకాశాలు దద్దరి ల్లాయి. సముద్రాలు కల్లోలమయ్యాయి. రాముడు నేల మీద నుంచి గుండ్రముగా వేసే బాణపరంపరతో రాక్షస సమూహాలు చెల్లాచెదురవుతున్నాయి. రావణుడు కూడా తాను తక్కువ కాదంటూ బాణాలను సంధించాడు. వీరిద్ద రూ వేసే బాణాలతో ఆకాశం కప్పబడిపోయి పట్టపగలు చీక టి ఆవరించింది. రావణుడు తన తూణీరంలోంచి అసుర అస్త్రం తీసి వానరులపై ప్రయోగించాడు. ఆ అస్త్రం నుంచి భయంకరమైన క్రూర మృగాలు, పాములు ఇతర విష జం తువులు బయటకు వచ్చాయి. అప్పుడు శ్రీరాముడు ఆగ్నేయ అస్త్రాన్ని ప్రయోగించడంతో అవన్నీ మాయ మయ్యాయి. అలా ఇరువురూ పోటాపోటీగా అస్త్రశస్త్రాలతో యుద్ధం చేస్తుంటే వానరులు, రాక్షసులు యుద్ధం చేయడం ఆపేసి వీరి యుద్ధం చూస్తున్నారు. దేవతలు సైతం వీరి యు ద్ధం మరల చూడలేమని పైనుంచి వీక్షించారు. ఇంతలో లక్ష్మణుడు రాముని వద్దకు వచ్చి అన్నా! కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి అని పలికి తాను రావణునితో యుద్ధా నికి దిగాడు. వెంటనే మానవుని పుర్రెలతో ఉన్న రావణుని రథ ధ్వజస్తంభాన్ని ధ్వంసం చేసాడు. ఆ తరువాత రహదా రిని వధించాడు.
ఇంతలో పక్కన ఉన్న విభీషణుడు తన గదతో రథాన్ని ముక్కలు చేసాడు. అంత రావణుడు భయంకరమైన శూలా న్ని విభీషణుడిపై వేయగా లక్ష్మణుడు దాన్ని మధ్యలోనే తుత్తితునియలు చేసాడు. వెంటనే రావణుని ధనస్సుని విరి చాడు. రావణుడు క్రుద్ధుడై ఎంతోమంది తెగటార్చిన బల మైన బల్లాన్ని లక్ష్మణుడిపైకి విసిరాడు. దాన్ని మయుడనే దానవుడు సృష్టించాడు. రావణుడు బల్లెం విసరటం చూసి న రాముడు ఈ బల్లెం లక్ష్మణుడి ప్రాణాలు తీయకుండుగాక అన్నాడు. ధర్మాన్ని అనుష్టించే వాడు రాముడు కనుక ఆయన మాటలు పొల్లుకావని వానర వీరులు భావించారు. లక్ష్మణుని ఛాతి చీల్చుకుంటూ ఆ బల్లెం బయటకు వచ్చి భూమిలోకి దిగింది. దాం తో లక్ష్మణుడు నెలకొరిగాడు. లక్ష్మణుడు పడిపోవ టం చూసి రాముడు విచారవదనంతో భ్రాతా లక్ష్మ ణా అంటూ అతని వద్దకు వచ్చాడు. అయినా రావ ణుడు రాముడిని అడ్డగించి బాణపరంపరను ప్రయోగించాడు. దాంతో ఒక్కసారిగా రామునికి క్రోధం పెల్లుబికింది. అప్పుడు వానరులతో ఓ వానరులారా మీరు భయపడకండి. ఇకపై భూమి మీద రాముడో, రావణుడో ఒక్కడే ఉంటారని పెద్దగా చెప్పి భీకరంగా బాణాలను సంధించాడు. శ్రీరాముడు వేసే బాణాలకు ఎదురు నిలబడలేక రావణుడు యుద్ధభూమి నుంచి పలాయనం చిత్తగించాడు. అంత వైద్యుడు సుషేణుడు లక్ష్మణుడి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని వెంటనే సంజీవిని తీసుకురావాలని హనుమ ను ఆదేశించాడు. వాయువేగంతో హనుమ కైలాస పర్వతం పక్కన ఉన్న ఔషధీ పర్వతం వద్దకు వచ్చాడు. కానీ సంజీవినిని గుర్తించలే క ఆలస్యమవుతుందని పర్వతాన్నే తీసుకువ చ్చాడు. సంజీవిని ప్రభావంతో లక్ష్మణుడు స్వస్థత పొందాడు. మరల హనుమ దాన్ని కొలాస పర్వతం వద్ద పెట్టి వచ్చాడు.
లంకకు పారిపోయిన రావణుడు మరల రథం, అస్త్ర శస్త్రాలను కూర్చుకుని మళ్లి యుద్ధానికి వచ్చాడు.యుద్ధం ప్రా రంభించాడు. రాముడు నేల మీద నుంచి చేస్తుంటే రావణుడు రథం మీద నుంచి చేయడం చూసి ఇంద్రుడు తన బంగారు రథాన్ని సారథి మాతలిని, మరికొన్ని అస్త్రాలను శ్రీరాముడి కోసం పంపాడు.
మాతలి భూమి మీదకు వచ్చి ఇం ద్రుడు రథం పంపినట్లు తెలిపాడు. అంత దశరథ తనయుడు రంగాన్ని అధిరోహించి దశకంఠునితో యుద్ధా నికి సమాయత్తమయ్యారు. ఇద్దరి మధ్య సమరం భీకరంగా సాగింది. దేవతలు యక్ష, కిన్నెర, గంధర్వా దులు ఆకాశం నుంచి సూర్యుని వలె ప్రకాశిస్తూ ఇంద్రుని రథం నుంచి శ్రీరాముడు చేసే యుద్ధాన్ని తిలకించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement