వా నుండి రాళే అనే మామల్తదారు శ్యామా పేరిట మూడు వందల మామిడి పళ్ళు వున్న పార్సిల్‌ను పంపించి బాబాకు నైవేద్యంగా సమర్పించ మని అభ్యర్ధన కూడా పంపాడు. శ్యామా వాటిని తీసుకువెళ్ళి బాబా ముందుపెట్టగా వాటిని పరిశీలించిన మీదట బాబా వాటిలో నుండి ఎనిమిది పళ్ళను తీసి శ్యామా చేతిలో పెట్టి దామ్యా కోసం దాచమని అన్నారు. మిగితా పళ్ళను అందరికి పంచిపెట్టమని ఆజ్ఞాపించారు. ఇం తలో కొంతమంది పిల్లలు వచ్చి కొళంబేలో వుంచిన ఆ ఎనిమిది పళ్లను తీసుకోబోతుండగా బాబా వద్దని వారిం చారు. వీటిని దాము అన్నా కోసమని వుంచానని అన్నా రు. అప్పుడు కొంత మంది భక్తులు ఇప్పుడు దాము అన్నా లేడు కదా అంటే అతనిప్పుడే కోపర్‌గాం చేరాడు. మరి రెండు గంటల్లో ఇక్కడికి రావచ్చును అన్నారు.
అయినా ఆ పిల్లలు నాలుగు పళ్ళను ఎత్తుకొని పారి పోయారు. బాబా లెండీబాగ్ నుండి తిరిగివచ్చాక దా మూ అన్నా శిరిడీ చేరి బాబాను యధావిధిగా పూజించా డు. బాబా కొళంబేను చూపించి ఆ మామిడి పళ్ళను తిని దామూ అన్నా చావవలెను అని అన్నారు.
చావు అన్నమాట వినగానే దామూ అన్నా గుండెలు వేగంగా కొట్టుకోవడం ప్రారంభించాయి. బాబా కొన్నిసా ర్లు నర్మగర్భితంగా మాట్లాడతారని తెలిసినా చావు అనే పదం తనపై ప్రయోగించేసరికి భయంతో తల్లడిల్లిపో యాడు. ఏడవడం ప్రారంభించిన దామూ అన్నాను మ#హల్సాపతి ఓదార్చాడు. ”బాబా చావు అన్న పదం నీ శరీరంపై కాక నీలో దాగి వున్న అవిద్య, మాయ, పాప కర్మలు,గర్వా#హంకారములపై ప్రయోగించారు కనుక భ యపడవద్దు.” బాబా ఆదేశల మేరకు దాము అన్నా ఒక పండును తిన్నాడు. ”మిగితా పళ్లను నీ భార్యకు ఇవ్వు, నీ కు ఎనిమిది మంది సంతానం కలుగుతారు, నీ వంశ ప్రతి ష్ట తరతరాలకు నిలబెడుతుంది” అని బాబా సెలవివ్వగా దాము అన్నా ఆయన ఆశీర్వాదాలను అందుకొని బయ లుదేరబోయాడు. వెంటనే వెనుదిరిగి ”వీటిని నా భార్య లలో ఏ భార్యకు ఇవ్వాలి?” అని సందే#హం వ్యక్తం చేయ గా ”నీ చిన్న భార్యకు ఇవ్వు” అని కోపంగా అరిచారు.
బాబా ఇచ్చిన ఈ ఆశీర్వాద ఫలాన్ని అందుకొని దా మూ పట్టరాని సంతోషంతో తన స్వస్థలానికి వెళ్ళాడు. బాబా అన్న మాటలు అక్షరాలా నిజమయ్యాయి. ఆ రోజు వరకు ఎంత యత్నించినా అతనికి సంతానం లేదు. పేరు మోసిన వైద్యులు అతని సంతాన లేమికి వైద్యం చెయ్యలేక పోయారు కానీ సమర్ధ సద్గురువు, భక్తుల పాలిటి ఆశ్రిత కల్పవృక్షం, కల్పతరువు అయిన శ్రీ సాయినాథుని ప్రసా దం స్వీకరించాక దామూకు అతని చిన్న భార్య వలన వరు సగా ఎనిమిది మంది సంతానం కలిగారు. అయితే కాలక్ర మేణా నలుగురు మరణించారు. బాబా ఇచ్చిన ఎనిమిది మామిడిపళ్ళలో నాలుగు పళ్ళు మాయమవడం భవిష్య త్తులో జరగబోవు ఈ సంఘటనకు సంకేతమని బాబా నిగూఢంగా సూచించినా ఎవరూ అర్ధం చేసుకోలేదు.
విచిత్రమేమిటంటే దత్త భక్తుడైన దామూ అన్నాకు తొలి సంతానం 1900వ సంవత్సరంలో దత్త జయంతి నాడు కలిగింది. బాబా ఆశీర్వాద ఫలం వలన మిగిలిన నలుగురు సంతానం ఆరోగ్యవంతులు, విద్యావంతులు అయ్యారు.దాము అన్నాకు ఎంతో కీర్తిని సంపాదించి పెట్టారు. బాబా వాక్కులు నిజమయ్యాయి.
బాబా ఆశీర్వాదం వలనే తనకు సంతానం కలిగి, సిరి సంపదలు, ప్రాప్తించి తన వం శం నిలబడిందన్న విశ్వాసం తో దామూ గోపాలరావు గుండు సలహాపై శ్రీ రామనవమి నాడు మశీదుపై ఒక నగిషీలు చెక్కిన జెండాను అలంకరించసాగాడు. దాము అన్నా వారసులు ఇప్పటికీ ఆ పద్ధతిని పాటిస్తున్నారు. అతడు శిథిలమైన మశీదు పురుద్ధరణ చేయించాడు.
దామూ ఒకసారి నైవేద్యం తయారుచేయించి బాబాను భోజనానికి ఆహ్వానించాడు. కానీ బాబా తన భోజనం కోసం మశీదును విడిచి బయటకు వెళ్ళరని దాము అన్నా ”బాబా, మీరు రాకున్ననూ బాలాజీ పాటిల్ నేవాస్కర్‌ను మా ఇంటికి భోజనం కోసం పం పండి. అతను నా ఇంట భోజనం చేస్తే మీరు నైవే ద్యం స్వీకరించినట్లే” అని అభ్యర్ధించాడు.
బాలాజీ పాటిల్ బాబాకు అత్యంత ప్రియ భక్తు డు. తక్కువ కులానికి చెందినవాడు. బాబా ”బా లాజీ మీ ఇంటికివస్తే దూరంగా కూ ర్చోబెట్టడమే కాక అస#హ్యంచుకుంటావు. తరిమేస్తావు కూ డా” అని అన్నారు. అలా చేయనని దామూ అన్నా చాలాసేపటి వరకు బ్రతిమిలాడిన త ర్వాత బాబా బాలాజీని దామూ ఇంటికి వెళ్ళ డానికి అంగీకరించారు. ఆ రోజు సాయి నాథ ని ప్రతినిధిగా తన ఇంటికి వచ్చిన బా లాజీ పాటిల్ నేవాస్కర్‌ను దామూ ఆద రించి, తగురీతిన అతిథి మర్యాదలు చేసాడు. అప్పుడే ఒక నల్ల కుక్క వచ్చి ఆశగా ఆ భోజన పదార్ధాల వంక చూస్తూ ఆకలితో తోక ఆడించసాగిం ది. ఎంతో అస#హ్యకరంగా వున్న ఆ కుక్కను తరిమేద్దామని, అంతలో నే బాబా చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి పళ్ళెంలో కొంత అన్నం ఆ కుక్కకు పెట్టాకే నేవాస్కర్‌కు వడ్డించాడు. ఆ కుక్క సంతృప్తి గా ఆ అనాన్ని తిని వెళ్ళిపో యింది. సరిగా అప్పుడే మశీ దులో బాబా ”దామూ అన్నా చాలా మంచి పని చేసాడు, నాకు నిజమైన భక్తుడు అనిపించుకున్నా డు” అన్నారు.
ఆశ్రిత కల్పవృక్షంసాయిబాబా!
Advertisement
తాజా వార్తలు
Advertisement