Saturday, November 23, 2024

అష్టాక్షరీ హోరు.. భక్తజన జోరు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆధ్యాత్మిక అద్భుతం సమతామూర్తి క్షేత్రానికి బుధవారంనాడు భక్తులు పోటెత్తారు. రామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని దర్శించుకుని పరవశించిపోయారు. ముచ్చింతల్‌ లోని శ్రీరామనగరంలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఎనిమిదోరోజు యాగశాలలో ఉదయం అష్టాక్షరీ మంత్ర పఠనం అత్యంత భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. భక్తులతో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీ మంత్ర పఠనం చేయించారు. శ్రీ హనుమత్సమేత సీతారామలక్ష్మణ సహిత స్వామివార్లకు ప్రాత: కాల ఆరాధన నిర్వహించారు. అనంతరం తీర్థగోష్ఠి జరిగింది. శాస్త్రోక్తంగా లక్ష్మీనారాయణ, హయగ్రీవేష్టి ఇక నేటి యజ్ఞంలో భాగంగా శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతవును 114 యాగశాలల్లోని 1035 హూమకుండాల్లో శాస్త్రోత్తంగా నిర్వహించారు. 5వేల మంది రుత్విజులు ఈ క్రతువులో పాల్గొన్నారు. ఐశ్యర్యప్రాప్తికి శ్రీలక్ష్మీనారయణ ఇష్టిని నిర్వహించారు. చిన్నారుల విద్యాభివృద్ధికి, పెద్దల మానసిక వృద్ధికి హయగ్రీవ ఇష్టి నిర్వహించా రు. ఈ సందర్బంగా భక్తులతో పూజలను చినజీయర్‌ చేయించారు.
ముగిసిన ధర్మాచార్యుల సదస్సు
దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన 200 మంది ఆచా ర్యులు, సాధుసంతులు, పీఠాధిపతులకు స్వయంగా సమతామూర్తిని చూపించారు త్రిదండి చిన్నజీయర్‌ స్వామీజీ. 108 దివ్యదేశాల గురించి వారికి విపులంగా వివరించారు. దేశం లోని ఆచార్యులు, సాధుసంతులచే రెండోరోజు ధర్మాచార్య సదస్సు జరిగింది. భగ వద్రామా నుజుల ఉపదేశాలను అందరికీ మార్గదర్శనం అని ప్రబోధించారు. ప్రవచన మండపంలో పండిత ప్రము ఖులు, ఉభయవేదాంత పీఠం సాతులూరి గోపాలకష్ణమాచార్యులు, కందా డై రామానుజా చార్యులు, విజయరాఘవన్‌, భద్రాచలం దేవాలయ అర్చకులు మురళీకృష్ణమాచార్యులు, శ్రీభాష్యం శ్రీనివాసాచార్యులు, శ్రీమతి చూడామణి భగవద్రామానుజాచార్యుల సిద్ధాంతాలను వివరించా రు. ప్రవచన కార్యక్రమాల్లో చినజీయర్‌తోపాటు రామచంద్ర జీయర్‌ పాల్గొని ప్రసంగించారు.

నేటి కార్యక్రమాలు
రోజువారీ శ్రీమన్నారాయణ క్రతువు, అష్టాక్షరీ అనుష్టానం రెండు పూటలా ఆజ్య పూర్ణాహుతి అకాలవృష్టి నివారణ, సస్యవృద్ధి కోసం వైయ్యూహికేష్టి వ్యక్తిత్వ వికాసం, దుష్టశక్తులనుంచి రక్షణ, ఆత్మసాక్షాత్కారం కోసం నారసింహేష్టి నిర్వహణ దివ్యదేశాల్లోని 20 ఆలయాలకు ప్రాణ ప్రతిష్ఠ, మహాసం ప్రోక్షణ, కుంభాభిషేకాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement