Saturday, November 23, 2024

ఆషాఢం అతిథులు…గ్రామదేవతలు

ప్రకృతిని శక్తిస్వరూపిణిగా, జగన్మాతగా కొలవ డం భారతీయ సంప్రదాయం. ప్రకృతి శక్తు ల విభిన్న కళలే గ్రామదేవతలని దేవీ భాగవ తం పేర్కొంటోంది. పరమాత్మను జగత్పతిగా, ప్రకృ తిని విశ్వమాతగా ఆరాధిస్తారు. ప్రకృతి తల్లిలాంటిది. ఆ తల్లి ఒడిలో సేదతీరాలంటే ఆమెను పూజించాలి. అంటే ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాలి. మాన వ మనుగడకు అదే శ్రీరామరక్ష. అందుకు భిన్నంగా వ్యహరించినప్పుడు, ప్రకృతి ప్రకోపిస్తే విపత్కర పరి ణామాలు ఎదురుకాక తప్పదు. వాటిని అధిగమించే క్రమంలో, అనంత కాలవాహనిలో మారుతున్న రుతువులు, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వివిధ రూపాలు, పేర్లతో కొలువైన గ్రామదేవతలను వేడుకుంటూ జరు పుకునే పండుగే బోనాలు. లోకకల్యాణం, సకల జన సంక్షేమం ఆషాఢ బోనాల అంతరార్థం. అలాంటి బోనాలకు శతాబ్దాల చరిత్ర ఉందని తెలుస్తోంది. ప్ర కృతి శక్తి ప్రసాదితాలైన సస్యాలు, ధాన్యాది శాకాలను ఆమెకే సమర్పించి కృతజ్ఞతను చాటుకోవడమే బోనా లు పరమార్థమనీ చెబుతారు. ఆరు వందల ఏళ్ల క్రితం పల్లవ రాజుల కాలంలో తెలుగు నేలపై బోనాల పండు గ ప్రాశస్త్యం పొందిందని ప్రతీతి. 15వ శతాబ్దంలో శ్రీ కృష్ణ దేవరాయలు ఏడు కోల్ల ఎల్లమ్మ నవద త్తి ఆల యాన్ని నిర్మించి, బోనాలు సమర్పించారట. ‘హంస వింశతి’ కావ్యంలోని పద్యంలో బోనాల ప్రస్తావన ఉంది. కాకతీయుల కాలంలో రుద్రమదేవి తమ ఇల వేల్పు ‘కాకతి’కి బోనాలు పేరుతో అన్నపురాశులను సమర్పించారని జాయపసేనాని ‘నృత్య రత్నావళి’ చెబుతోంది. రెండవ ప్రతాపరుద్రుడి హయాంలో ఆషాఢ బోనాల సందర్భంలో అన్న సంతర్పణ అవి చ్ఛిన్నంగా సాగిందని చరిత్ర చెబుతోంది.
ఇక భాగ్యనగరం విషయానికి వస్తే 1869లో ప్లేగు వ్యాధి ప్రబలి పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం వాటి ల్లింది. అందుకు దైవాగ్ర#హం కారణంగా భావించిన ప్రజలు, ఆ విపత్కర పరిస్థితి నుంచి బయటపడేందు కు గ్రామదేవతలను శాంతపరచడమే శరణ్యంగా భా వించారట. అమ్మవారిని ప్రకృతి స్వరూపంగా ఆరాధి స్తూ, జాతర మరింత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తున్నారు.

గ్రామ దేవతల ఆరాధన

నల్లటి మబ్బులతో ఆకాశం గర్జిస్తూ ఉంటే.. ఆషా ఢం వచ్చినట్టే. ఆధ్యాత్మికతకు తొలిమాసంగా భావిం చే ఈ ఆషాఢ మాసం మరీ ప్రత్యేకం. అనుకోని విపత్తు ల నుంచి తమను కాపాడాలంటూ ఆదిశక్తి రూపాల కు బోనాలు సమర్పించి వేడుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ప్రత్యేకించి తెలంగాణ జానపద సంస్కృతి పర్వదిన త్రయంలో ఇది ఒకటి కాగా, బతుకమ్మ రెం డవది, సమ్మక్క సారలమ్మ జాతర (ఇది రెండేళ్లకు ఒ క సారి వస్తుంది) మూడది. అమ్మవారికి ప్రీతికరమైన ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించడం సంప్రదా యం. గ్రామదేవతలను ఆషాఢం అతిథులుగా ఆరా ధించే సంప్రదాయం తెలంగాణలో కొనసాగుతోంది’ అని పాల్కురికి సోమనాథుడు తమ ‘పండితారాధ్య చరిత్ర’లో పేర్కొన్నారు. గ్రామ దేవతలకు పసుపు కుం కుమలు, చీర సారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుంటారు. ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ము త్యాలమ్మ ఇలా శక్తి స్వరూపమైన అమ్మవార్ల వద్ద తమ ను చల్లగా చూడమని వేడుకుంటారు. ప్రకృతి శక్తుల విభిన్న కళలే గ్రామదేవతలని దేవీ భాగవతం పేర్కొం టోంది. శ్రీమాత సకల జగత్తును ఉదరమనే అమృత భాండంలో నిక్షిప్తం చేసుకుందని, అందుకు సంకేతం గా అన్న పదార్థాలను మట్టి కుండలలో వండి ‘బోనా లు’గా సమర్పిస్తారని చెబుతారు.
”మన శరీరం బోనపు కుండకు ప్రతీక అనుకుం టే కుండలోని అన్నం జీవశక్తికి సంకేతం. కుండపై వెలి గే దీపం ఆత్మజ్యోతి. ఈ ఆత్మజ్యోతిని పరంజ్యోతి తో మమేకం చేయాలన్నది బోనాలు సంబరాల ఆంత ర్యం” అని ఆధ్యాత్మికవాదులు విశ్లేషిస్తారు.

సంక్రమిక వ్యాధులు ప్రబలకుండా..

ఆషాఢంలో ప్రకృతిపరంగా అనారోగ్య పరిస్థితు లు ఏర్పడతాయి. వర్ష ప్రభావం వల్ల సాంక్రమిక వ్యా ధులు ప్రబలే అవకాశం ఉంది. ఇలాంటి వాటి నుంచి రక్షణ పొందేందుకు దైవశక్తిని ఆశ్రయించడంలో భాగంగా శక్తిని అర్చించాలన్న ఆర్షధర్మం ప్రకారం, వివిధ దేవతలను ఆరాధిస్తారు. అందులో బోనాలను ఒక భాగంగా చెబుతారు. బోనాలలోని శాస్త్రీయతను తెలిపే అనేక విషయాలను ఉదహరిస్తారు. ‘పసుపు, బెల్లం, బియ్యంతో తయారుచేసే బోనా న్ని స్వీకరించడం వల్ల పసుపులోని యాంటీ బయోటి క్స్‌ దేహంలోని రోగ కారకాలను నాశనం చేస్తాయి. వేపా కులతో కూడిన మట్టికుండలను మోసుకురావడం వల్ల వాతావరణంలోని వ్యాధికారక క్రిములు నశిస్తా యి. మహళలు పాదరక్షలు లేకుండా పసుపు కాళ్లతో నడిచి రావడంవల్ల పాదాల పసుపు నేల రాలి మట్టి లోని వ్యాధి కారకాలను నిర్మూలిస్తుందని, వేపా కు క్రిమి నాశినిగా పనిచేస్తుంది కనుక రోగ నిరోధకత కోసం ఇంటికి వేప తోరణాలు కడతారని చెబుతారు. బోనాల సందర్భంగా మహళలు కాళ్లకు రాసుకునే పసుపుతో వానాకాలంలో అరికాళ్లు చెడకుండా ఉం టాయి. దీంతోపాటు ఈ పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మానికి, వీధి వీధికి వేపాకు మండలు కడతారు. వేపాకులో ఉండే ఔషధగుణం ద్వారా క్రిమి కీటకాలు నాశనం, అంటువ్యాధులు దరికి చేరవు.

- Advertisement -

బోనమంటే…

అమ్మవారికి భక్తితో సమర్పించే పప్పు అన్నాన్ని బోనం అంటారు. ఇది భోజనం అనే మాట నుంచి వచ్చింది. ‘భోజనం’ ప్రకృతి కాగా, ‘బోనం’ వికృతి. వేకువజామునే తలస్నానం చేసి పరిశుభ్రమైన దుస్తు లు ధరించి కొత్తకుండలో బియ్యం, పాలు, నెయ్యి, చక్కెర కలిపి నైవేద్యం తయారు చేస్తారు. మట్టి లేక రాగి పాత్రలో వండుతారు. ఈ పదార్థాలతో కూడిన నైవేద్యంతో పాటు భక్తులు తమ మొక్కుబడులకు అనుగుణంగా కూడా ప్రసాదాలు తయారు చేస్తారు. ఫలానా పదార్థాలతో నైవేద్యం పెడతామని మొక్కు కుంటే వాటితోనే చేస్తారు. నైవేద్యం ఏదైనా దానితో పాటు ‘సాకర’ (చెట్టుకొమ్మ)ను సమర్పిస్తారు. కొత్త కుండకు సున్నం రాసి, చుట్టూ పసుపు, కుంకుమతో అలంకరించి, దానిపై దీపం (గండ దీపం) ఉంచి, తల పై పెట్టుకుని డప్పు చప్పుళ్లతో ఆలయానికి వెళతారు. అక్కడ ఏడు ప్రదక్షిణలు చేసి బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు. కొంత ప్రసాదాన్ని ఇళ్లకు తెచ్చుకొని ఇరుగుపొరుగులకు పంచుకుంటారు. అమ్మవారు ‘చిత్రాన్నప్రియ’ అని స్తోత్రాలు చెబుతున్నందున ఆ తరహా నైవేద్యాలూ సమర్పిస్తారు. స్త్రీ శక్తికి ప్రతిరూ పం. సంప్రదాయానికి చిహ్నం. అందుకే ఈ బోనాన్ని మహళలే తయారుచేస్తారు. బోనం తలకెత్తుకున్న వారిని ‘అమ్మశక్తికి ప్రతీకగా భావించి, భక్తులు బోనమె త్తిన వారి పాదాలను కడుగుతారు. బోనాన్ని సమర్పిం చే ప్రక్రియను ‘ఊరడి’ అంటారు.

సంస్కృతి సంప్రదాయాలకు అద్దం….

కాకతీయుల కాలం నుండి ఈ బోనాల పండుగ ఆచారంగా వస్తుందని మన పూర్వీకులు చెబుతున్న మాట. అమ్మ వారు ఆషాఢ మాసంలో ఆడపడుచుగా పుట్టింటికి వస్తుందని ఆమెకు ఎంతో ఇష్టమైన పిండి వంటలను వండి కొత్త కుండలో నైవేద్యంగా సమర్పిం చడమే బోనాల పండుగ. ఈ పండుగ వెనకున్న ప్రధాన కారణం ప్రకృతి ప్రళయాలను సృష్టించకుం డా రక్షించమని అమ్మవారిని ప్రార్థించడం.

Advertisement

తాజా వార్తలు

Advertisement