Monday, November 11, 2024

అరుంధతి-వశిష్ఠుల బంధం!

పురాణాల ప్రకారం, వశిష్ట మహర్షి భార్య పేరే అరుంధతి. వి వాహం అయిన ప్రతి ఒక్కరూ ఈ అరుంధతీ నక్షత్రాన్ని దర్శించుకోవ డంవల్ల వారి సంసార జీవితం సాఫీగా సాగిపోతుందని భావిస్తారు.
కేవలం అరుంధతీ నక్షత్రాన్ని మాత్ర మే కాదు.. దానిపక్కనే ఉన్న వశిష్ట నక్షత్రా న్ని కూడా దర్శించుకోమని పూజారి చెబు తారు. ఆకాశంలో తూర్పు వైపున అరుంధ తీ, వశిష్ట అనే రెండు నక్షత్రాలు చాలా దగ్గరగా ఉంటాయని పండి తులు చెబుతారు.
పురాణాల ప్రకారం, బ్రహ్మదేవుని కూతురి పేరే సంధ్యాదేవి. వశిష్ట మహర్షి ఉపదేశం చేసిన తర్వాత సంధ్యాదేవి తన దేహాన్ని అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. ఆ అగ్నిలో నుంచి ప్రాత:సం ధ్య, సాయం సంధ్యలతో ఓ అందమైన స్త్రీ రూపం సృష్టించబ డింది. అందమైన ఆ మహళే అరుంధతి.
అలా అగ్నిలో నుంచి వచ్చిన అరుంధతి అందమై న రూపాన్ని చూసిన వశిష్ట మహర్షి ఆకర్షణకు లోన వుతాడు. ఆమెను మనువాడాలని నిర్ణయించు కుంటాడు. వీరిద్దరూ వివాహం చేసుకునే సమయంలో వశిష్ట మహర్షి తన చేతిలోని కమండలాన్ని అరుంధతికి ఇచ్చి వెళ్తాడు. తాను ఎప్పుడైతే తిరిగొ స్తానో అప్పటివరకు ఎదురు చూడాలని ఆదేశిస్తాడు. వశిష్ట మహర్షి కొన్ని సంవత్స రాలు గడిచినప్పటికీ తిరిగి రాలేదు. అరుం ధతి మాత్రం కమండలాన్నే చూస్తూ కాలం గడిపేస్తోంది. తన చూపును తమ వైపునకు తిప్పుకోవాలని ఎందరో ఋషులు ప్రయ త్నించినా ఫలితం మాత్రం రాలేదు.
దీంతో చేసేది లేక వశిష్టుడు ఎక్కడున్నాడో తీవ్రంగా అన్వేషిం చి, చివరికి తన ఆచూకి కనుగొంటారు. వశిష్టుడిని తీసుకొచ్చి అరుంధతి ముందు నిలబెడతారు. అప్పుడు మాత్రమే తన చూపు ను వశిష్టుని వైపునకు తిప్పింది.
అప్పటి నుంచి అరుంధతి మహా పతివ్రతగా పేరు సంపా దించింది. తను మొక్కవోని దీక్షతో నక్షత్ర రూపంలో ప్రకాశి స్తూ గగనంలో శాశ్వతంగా నిలిచిపోయింది. అందుకే తా ళికట్టిన వెంటనే కొత్త జంటలకు అరుంధతి నక్షత్రాన్ని చూపుతారు. అరుంధతిలాంటి లక్షణాలు కలిగి ఉం డాలని, తమ బంధం అరుంధతి, వశిష్టునిలా కలకాలం నిలిచిపోవాలని కోరుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement