కాకతీయ శిల్ప కళా వైభవానికి నిలువెత్తు సాక్ష్యం గా నిలిచి ఉన్న అరుదైన ఆలయాలు వరంగల్, హనుమకొండలలో ఎన్నో ఉన్నాయి. అందులో ప్రాచీన కాలంలో అత్యంత వైభవోపేత పాంచాలరా య స్వామి దేవాలయం ఒకటి. కాకతీయ శైలీ నిర్మాణానికి కాకతీయుల కళావైభవానికి మచ్చుతు నకగా నిలుస్తుంది. ఈ ఆలయం వరంగల్‌కు 18 కి.మీ దూరంలో వున్న గీసుగొండ మండలంలోని శాయంపేట (హవేలి)లో వుంది. సర్వప్ప రచించిన సిద్ధేశ్వర చరిత్రలో పాలంచాలరాయని ప్రసక్తి కనిపి స్తుంది. బేతరాజు ఆ మూర్తికి అనుమకొండ తూర్పు ముఖాన దేవాలయం కట్టించినట్లుగా వృత్తాంతీకరించి నాడు శాయం పేట గ్రామం హనుమకొండకు తూర్పు వైపునే ఉంది. ఇక మరొక ఆధారం షితఫతి రాజు (షితాబుఖాను) శాసనం ముస్లింల నుం డి ఓరుగల్లు కోటను జయించిన సందర్భంగా షితాబుఖాను క్రీ.శ.1504లో వేయిం చిన శాసనంలో అన్య మతస్థులు చేసిన విధ్వంసంకాండలో వైభవాన్ని కోల్పోయి పాంచరాయని పున రుద్ధరించినట్లుగా పేర్కొన్నారు. ఈ శాసనకర్త అన్నార్యుని కు మారుడు నామధేయుడు. ఈ శాసనంలో-
‘పాంచాల్వై పరిభూత ధైన్య బ#హుళ ప్రోద్భత్కపావేశత
ప్రానాదక్షయ వస్త్ర జాత మమలం యోగోపి కావల్లభ:
తంస్థానాచ్చలితం దురీతి విభవాత్సల చాలరాయపున
ర్ఛోగే చిత్తాపఖాన భూమి రమణ: సిహాసనేస్థాపయత్”
”దుష్టులచే పరిభవింపబడి దైన్యము పొంది న పాంచాలికి కృష్ణామయుడైన గోపికా వల్లభుడు అఓయ వస్త్ర పరంపర నొసంగినాడు. దష్టులచే స్థానచలనం పొందిన అట్టి పాంచాల రాయుని చిత్త సభినుడు మరల సింహాసనాధిష్టతుని చేసి పునర్వై భవాన్ని కలిగించినాడు అని పేర్కొన్నారు. చరిత్ర కాధారాల ప్రకారం తురుష్క దండయాత్రల వల్ల ఆలయం ధ్వంసమైపోగా షితాబుఖాను దీనిని పునరుద్ధరించి ఉండవచ్చు. పాంచాలీశ్వర దేవాల య ప్రాంగణంలో తిమ్మామాత్యుడు సువర్ణ కుం భలెత్తబడిన భవనాన్ని కట్టించినాడట. అయితే నేడవేవీ మనకు కనిపించవు. పాంచాలి మాన సంరక్షణ చేసిన శ్రీకృష్ణుడు పాంచా లరాయడుగా ప్రసిద్ధుడైనాడు. అయితే శ్రీకృష్ణుడు ”పాంచాల రాయడు”గా పూజలందుకోవడం ఈ దేవాలయంలో తప్ప భారతదేశంలో మరే ప్రాంతంలో లేదు.
ప్రస్తుతం ఆలయం చాలా భాగం శిథిలమై పోయింది ప్రాం గణానికి నైఋతి మూలన శిథిలావస్థలో ఉన్న కాకతీయ స్తం భాలుకల కళ్యాణ మంటపం, వాయువ్య మూలన ఆళ్వార్ల మం టపం, ఈశాన్య మూలన క్రొత్తగా నిర్మించిన కళ్యాణ మంటపం ఉంది. మొత్తం ఆలయం గర్భ గృ#హం అంతరాళం చుట్టూ ఆల యంలోపలే (ఆలయం గోడ గర్భ గృహం అంతరాళం గోడల మధ్య) ప్రదక్షిణ పధం ఉంది. కాని ప్రస్తుతం రాతిపలకల చేత మూసి వేయబడింది. ఆలయం బయట గోడ రాళ్ళ భాగాన నలుచదరాన్ని ఏర్పరుస్తూ నాలుగు కాకతీయ శైలీ స్తంభాలు ఉన్నాయి. గర్భగృ#హంపైన ఉన్న శిఖర తరువాతి కాలానికి చెందిన పిరమిడ్ ఆకారపు శిఖరం. శిఖరం పైన ఉన్న చతుర స్ర కారపు దిమ్మెపై ఆయుధం ప్రతిష్టించబడింది. ఈ దిమ్మెపై తూర్పు ముఖాన శంఖచక్రాలు, ఉత్తర పశ్చిమ, దక్షిణ ముఖాల పై కీర్తి ముఖాలు ఉన్నాయి.
ఆలయ ప్రత్యేకత అంతా గర్భగుడిలోని మూర్తిలో ఉంది. నల్ల గ్రానైటు రాతితో చెక్కబడ్డ అరవై ఆరు అంగుళాల పొడవైన కాంతివంతమైన మూర్తి విగ్రహం ఇది. పాంచరాత్రగమం ప్రకా రం విష్ణుమూర్తి చతుర్వింశతి వ్యూహాలలో ఇది కేశవమూర్తి. చతుర్భుజాలలో కుడి పైచేతిలో శంఖం, ఎడమపై చేతిలో చక్రం, ఎడమ క్రింది చేతిలో గద, కుడి క్రింది చేతిలో పద్మమూ ఉన్నా యి. మూర్తికి ఇరుప్రక్కలా చమర గ్రహణులున్నారు. విగ్రహ పాద దేశానికి కుడి వైపున గరుడుడు. ఎడమ లక్ష్మీదేవి చెక్కబ డ్డారు. విగ్రహం వెనుకన చుట్టూ ఉన్న చట్రం పైభాగాన మరక తోరణం పైభాగాన వలయాల మధ్య వరుసగా, మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, బుద్ధ, కల్కిఅవతారాలు చెక్కబడి ఉన్నాయి. మూర్తి శరీర భాగాలు ఇతర అలంకరణ, ఆయుధాలు మకర తోరణం గొప్ప పనితనంతో చెక్కబడ్డాయి. చేతి వేళ్ళు మెరిసే గోళ్లు స్పష్టంగా కన బడతాయి. ఇంత అందంగా చెక్కబడ్డ మూర్త్తికీ, ఇతర దేవాల యాలో మూర్తికి తేడా వుంటుంది. పైన పేర్కొన్న ఆధారాల వల్ల కాకతీయుల కాలంలోనూ, ఆ తరువాత పదహారవ శతాబ్దం వరకూ వైభవ స్థితిలో ఉండేదనటానికి సందేహం లేదు.
అరుదైన పాంచాలరాయస్వామి ఆలయం
Advertisement
తాజా వార్తలు
Advertisement