శ్రీకృష్ణ పరమాత్మను ఒక సారి ఆయన కుమారుడు సాంబుడు విశిష్ట దేవతారాధన గురించి తెలియచేయమని ప్రార్థిం చెను. అంత శ్రీకృష్ణ భగవానుడు, దేవతా ప్రసాదము కంటె మించినది లేదు. విశిష్టమైన దేవతలను చిత్త శుద్ధితో పూజించి కీర్తించినవారు విశి ష్ట ఫలమును తప్పక ప్రసాదించె దరు. ఆగమ శాస్త్రము దేవతల యొక్క ఉనికిని నిశ్చితముగా తెలి యచేసినది. అనేక ప్రమాణములు దేవగణముల నివాసమును స్థిర పరచినవి. కావున అనేక దేవతలు న్నను ప్రత్యక్షముగా దర్శనమిచ్చు దేవత ఆదిత్యుడైన సూర్యభగవానుడు. ఒక్క సూర్య భగవానుడే ప్రత్య క్ష పరమాత్మ. జగచ్చక్షువైన ఆదిత్యుడు సర్వమునే వీక్షించుచున్నాడు. ఈ జగత్తున సృష్టి స్థితి లయములు ఆయన వలననే జరుగుచున్నవి. సర్వభూతములకు అతడే హేతువు. కృతయుగము నుండి సూర్యుడే కాల స్వరూపము. ఇంద్రాది దేవతలు అతని రూపములే! వేదములు కీర్తించుచున్న పరమాత్మ సూర్యుడే! పురాణములు పేర్కొన్న అంత రాత్మ సూర్యుడే!
సర్వ జీవ దేహముల యొక్క నిర్మాత, ప్రేరకుడు సూర్యభగవాను డు. సూర్యమండల స్థితుడైన ఇతనిని జపించిన వారికి సర్వసిద్ధులు లభి స్తాయి. నీవు అంగ కవచములతో సూర్యుని ఆరాధించుము. ఎవరైతే సూర్యుని ఆరాధిస్తారో వారికి ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక దు:ఖ ములు దరిచేరవు. సూర్యోపాసన చేసినవారికి గ్రహశాంతి అవసరము లేదు. అనగా అంత ప్రముఖమైనది సూర్యారాధన.
ఆదిత్యునకు అర్ఘ్యతర్పణములు అత్యంత ప్రీతికరములు. ఈ విధముగా సాంబునకు శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుని విశిష్టతను తెలియచేసెను. సూర్యారాధనలో ఆయన అంశ లను పన్నెండుగా గుర్తించారు. పన్నెండు నామములతో ఆయనను ఆరాధన చేయడం ఒక సనాతన రహస్యం. అవి ఇంద్రుడు అసుర సంహారమూర్తి. ధాత జత్తు యొక్క సృష్టికర్త, పర్జన్యమూర్తి అమృతము వర్ణించును, పూష మంత్రముల ద్వారా ప్రజాపుష్టి, త్వష్ట వనస్పతులు, ఔషధముల సృష్టికర్త, ఆర్యమ జీవ శరీరములందు సంవరణశక్తి, భగ పర్వతములు, భూమియందు నిక్షిప్త శక్తి, వివస్వంతుడు అగ్ని రూప మున జీవుల ఆహారమును పచనము చేయును. అంశువు చంద్రుని ద్వారా జగములను ఆప్యాయము చేయును, విష్ణువు దేవతాంశ శత్రు వులను అంతము చేయును. వరుణమూర్తి జగములను సేవింపచేయు ను, మిత్రనామమున జగములకు చైతన్యమును అందించును. ఈవిధ ముగా పన్నెండు ఆదిత్యుని అంశలు సృష్టిని సంరక్షించుచున్నవి. సూర్యునికి సారథి అనూరుడు. ఆదిత్యునికి ఇరువైపులా రాజ్ఞి, నిక్షుభ ధర్మపత్నులై విరాజిల్లుచుందురు. ఇట్లు ద్వాదశ స్వరూపుడైన ఆదిత్యు ని విస్తారము తొమ్మిదివేల యోజనములు. ఈయన మూడువందల కిరణములు ముల్లోకములను పాలించుచున్నవి.
అవతార పురుషులు సైతము సూర్యోపాసన చేసి విజయము సాధించినారు. శ్రీరామచంద్రుడు ఆదిత్య హృదయమును పఠించి రావణ సంహారం చేసినాడు. ధర్మరాజు సూర్యుని స్మరించి అక్షయ పాత్రను పొందినాడు. సత్రాజిత్తు సూర్యోపాసన చేసి శ్యమంతకమణిని పొందినట్లు మనకు తెలియును. కుంతీదేవి కర్ణుని, ఋక్ష రజస్సు అను వానర శ్రేష్టుడు సుగ్రీవుని సూర్యుని స్మరించి పుత్రులుగా పొందారు. వేదములలో సూర్యుడు ఆరోగ్యదేవత అని పేర్కొన్నవి. ఇక ఆధునిక వైద్యశాస్త్రము కూడా సూర్యకిరణములు అనేక వ్యాధులను, రుగ్మత లను రూపుమాపునని నిరూపించినది. శరీరానికి ముఖ్యమైన విటమిను లను ఉదయకాల సూర్యకిరణములు పుష్కలముగా అందించునని సూచించుచున్నది.
”ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్” అన్నట్లు ఆరోగ్య ప్రదాత సూర్యుడు. సూక్ష్మముగా ఆలోచించిన మన భూమిపై జీవమునకు కారణము సూర్యుడు. సూర్యకిరణముల తాకిడిచే సమస్త జీవజాలము జనించి, జీవించుచున్నవి.
ఆరోగ్యము లేకపోయినచో మానవుడు దేనినీ సాధించలేడు. చివరకు ఆధ్యాత్మిక సాధన చేసి ముక్తిని, మోక్షమును పొందవలెనన్న శక్తివంతమైన దేహము, మనసు అవశ్యము. అప్పుడే ఆత్మశోధనకు అవకాశము ఏర్పడును.
అందువలననే మనకు రవివారము ప్రసాదించబడినది. ఆదివార మునాడు సత్యవ్రతులై, శుచిర్భూతులై కొన్ని నియమములను పాటించి సూర్యారాధన, ఇష్టదైవ సంకీర్తన చేసినవారికి ఆరోగ్యమేగాక సచ్చిదా నందము కల్గునని మన సనాతన ధర్మము ధృవీకరించినది. సూర్య నమస్కారములను యోగ మార్గము మన భారతీయ సంస్కృతిలో ఒక ఆరోగ్య నిధి సమానమైనది. ఆదివారము ఆద్యంతమూ మంత్ర పఠనమునకు, పూజలకు అత్యంత ఫలప్రదమైనది.
సూర్యోదయమునకు ముందే నిద్ర నుండి మేల్కొనడమనేది ఒక గొప్ప సుగుణం. ప్రాత:కాల బ్రహ్మ ముహూర్తమున స్నానమాచరిం చడమనునది అనేక ప్రయోజనములను చేకూర్చునని మన శాస్త్రములు తెలియచేస్తున్నాయి. అలాగే సూర్యునికి అభిముఖముగా ఎటువంటి అనాచార క్రియలు చేయకూడదని విజ్ఞులు సూచిస్తున్నారు. కావున మనము కూడా ప్రత్యక్ష భగవానుడైన సూర్యుని పూజించుదాము. సూర్య ప్రసాదమైన కిరణములను ఆస్వాదించి ఆరోగ్య అనుగ్రహం పొందుదాము.
ఆరోగ్య ప్రదాత… ప్రత్యక్ష దైవం
Advertisement
తాజా వార్తలు
Advertisement