Friday, November 22, 2024

అర్హత…అధికారాన్ని అందించేవి కర్మలే!

”ఏదీ తనంత తానై నీ దరికి రాదు. శోధించి సాధించా లి. అదియే ధీర గుణం.” అనంటారు మహాకవి శ్రీశ్రీ.
ఏది సాధించాలన్నా, ఏదైనా సంపాదించాలన్నా మనకి అర్హత ఉండాలి. అర్హత ఉంటేనే మనం ఏ అధికారా న్ని అయినా సాధించగలం. ఏ స్థాయినైనా, స్థానాన్ని అ యినా అధిరోహంచగలం. మనకు అర్హత ఉన్నట్టయితేనే దేన్నైనా పొందే అధికారం వస్తుంది. అధికారం అంటే… మామూలుగా మనం అనుకునే అధికారం కాదు. మన ఆధిక్యాన్ని ఆసరా చేసుకుని, అందరి మీదా అజమాయిషీ చేసే ఆధికత్వం, అధికార తత్త్వం కాదు. ఆధిపత్య ధోరణి అంతకన్నా కాదు.
మనల్ని మనం ఉద్ధ³రించుకోవటానికి మన జీవితా లను ఇహంలోనూ, పరంలోనూ ఉన్నతం చేసుకోవటా నికి… మనం చేసే పనులతో మనం తెచ్చుకునే సామర్థ్యమే అర్హత అంటే.
అర్హత ఉన్న తర్వాత అవసరమైన ప్రయత్నం చేయా లి. ఈ సూత్రం భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలకే కాకుండా ఆధ్యాత్మికానికి సంబంధించిన అంశాలకు కూడా వర్తిస్తుంది. మనకున్న అర్హతను మూ లం చేసుకుని, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకోవటా నికి, మనం ఆచరించే కర్మలే పైన చెప్పుకున్న అధికారాన్ని మనకి అందిస్తాయి.
నిజానికి పరం గురించి ఆలోచన చేస్తే, అంతా అయో మయంగా ఉంటుంది. గందరగోళం అనిపిస్తుంది. అం తా అర్ధమైనట్లు ఉంటుంది. ఏమర్ధమైందో అని తెలుసుకో వాలనుకుంటే ఓ పట్టాన అంతుచిక్కదు.
సద్భావనలు, సచ్ఛింతనలతో సకర్మలను మనం ఆచరిస్తుంటే—మరణించాక మనకి స్వర్గం ప్రాప్తిస్తుంది అని అంటారు. దుష్టచింతనతో దుష్టబుద్ధ³ితో పాపకర్మల ను ఆచరిస్తూ జీవితాన్ని గడిపితే పరంలో, నరకం ప్రాప్తి స్తుందంటారు. అక్కడ ఘోరాతి ఘోరమైన, పైశాచికమై న శిక్షలను అనుభవించాలంటారు. ఇవన్నీ నిజమో కాదో అనే వాదాలు, తర్కాలు అటుంచితే, మంచి పనులు చేస్తే స్వర్గం వెళ్లేందుకు మనకు అర్హత, అధికారత సమకూరు తాయని మొత్తంగా అర్ధమవుతుంది.
ఒకానొక సమయంలో ముగ్గురు వ్యక్తులు స్వర్గద్వా రం వద్దకు వచ్చారు. మొదటి వ్యక్తి ద్వారపాలకునితో ”నేను పండితుడ్ని. సర్వశాస్త్ర పారంగతుడ్ని. అన్ని శాస్త్రాలను, గ్రంథాలను ఔపోసన పట్టాను. నాకు స్వర్గ ప్రవేశం కల్పించు.” అని అన్నాడు. దానికి ద్వారపాలకు డు ఇలా అన్నాడు. ”అయ్యా! మీకు గ్రంథాలతో పరిచ యం ఉంది. శాస్త్రాల మీద పట్టు ఉంది. కానీ అనుభవం, అనుభవ జ్ఞానం లేదు. మీకు స్వర్గం ప్రవేశించడానికి అర్హత లేదు.” అన్నాడు.
రెండో వ్యక్తి ద్వారపాలకుని దగ్గరకు వచ్చాడు. ద్వారపాలకునితో ”నేను ఎన్నో యజ్ఞాలను, యాగాలను, క్రతువులను చేసిన వ్యక్తిని. ఎందరి చేతో చేయించిన వాడిని. యజ్ఞ యాగాల్ని చేసిన సోమయాజిని. ద్వారం తెరువు.” అన్నాడు. అప్పుడు ద్వారపాలకుడు ”అయ్యా! మీరు ఎన్నో యాగాలు, యజ్ఞాలను ఆచరించారు. కాద నను. కానీ స్వార్ధబుద్ధితో ఆచరించారు. మీరు చేసిన వాటిలో ఏ ఒక్కటిలో నిస్వార్థత ఏమాత్రం లేదు. స్వార్ధం తో చేసిన ఎంతటి మంచి పనైనా స్వర్గప్రవేశానికి అర్హత సం పాదించలేదు. కాబట్టి మీకు స్వర్గంలోనికి ప్రవేశించే అధి కారం లేదు. వెళ్లిపో.” అన్నాడు.
అప్పుడు మూడో వ్యక్తి ద్వారపాలకుని వద్దకు వచ్చా డు. అతనొక రైతు. ”నాకు మూడెకరాల పొలం ఉం ది. ఒ క చిన్న గుడిసె వేసుకుని జీవించాను. అహోరా త్రాలు నా దృష్టంతా నా పొలం సాగు మీదే. కష్టపడి నా శక్తి మేర సాగు చేసాను. పంటలు బాగా పండించాను. నాకున్న దాంట్లోనే ఆ దారిన వచ్చిపోయే బాటసారులను ఆదరిం చాను. నాకున్నంతలో వారికింత పెట్టాను. నేను కూడా కొంత తింటూ కాలం గడిపాను. ఇంతకన్నా నేనేమీ చేయ లేదు. ఏదీ సాధించలేదు.” ద్వారపాలకుడుకి చెప్పాడు.
అప్పుడు ద్వారపాలకుడు రైతుతో ”అంతకన్నా మరేం చేయాలి? నీకున్న దాంట్లో కొంత త్యాగం చేసావు. ఇతరులకు ఇంత పెట్టావు. కాబట్టి నీకు స్వర్గ ప్రవేశాధి కారం ఉంది. నీకు స్వర్గద్వార ప్రవేశం కల్పిస్తున్నాను.” అంటూ స్వర్గ ద్వారం తెరిచాడు ద్వారపాలకుడు.
త్యాగ గుణం అన్ని గుణాలలోను మహోత్కృష్టమై నది. త్యాగ గుణం స్వర్గ నివాస యోగం కల్పిస్తుంది. స్వర్గ ప్రవేశాధికారం కలిగిస్తుంది.
అందుకోసం మనం జీవించి ఉన్నప్పుడే సేవాదృక్ప థంతో, త్యాగ గుణాన్ని అలవాటు చేసుకోవాలి. అలవ ర్చుకోవాలి. ఇహంలోనే పరం కోసం ప్రయత్నించాలి. ప్రయత్నం చేయాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement