Saturday, November 23, 2024

అరంజ్యోతి-అరుంధతి

హిదూసంప్రదాయం ప్రకారం గృహస్థులు ప్రతిశు భకార్యం ”ఉమా మహశ్వరాభ్యాం నమ:, లక్ష్మీనారాయ ణాభ్యాం నమ:, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమ:, శచీపురంద రాభ్యాం నమ:, అరుంధతీ వశిష్టాభ్యాం నమ:, సీతారామా భ్యాం నమ:” అంటూ ఆరుగురు ఆదర్శ దంపతులను స్మరించి నమస్కరిస్తారు. వారిలో సప్తర్షి మండలంలో స్థానం పొందిన సాధ్వి అరుంధతిని ఆదర్శంగా తీస కుని కాపురం సాగించమని వధువుకు బోధిస్తారు. అరుంధతీ(నక్షత్రం) వందనీయమైనది అని ‘సూత సంహిత’ చెబుతున్నది. శౌనకాది మహర్షి గణాలకు ఒక సారి ఇదే సందేహం కలిగింది. దీనిని వారు త్రికాలవేత్తయిన సూ తుడు ముందుంచగా, ‘అరుంధతీదేవి’ ప్రాముఖ్యతను చెప్పారు.
”అరుంధత్యనసూయా చ సావిత్రీ జానకీసత్‌
తేజస్వనీ చ పాంచాలీ వందనీయ నిరంతరం!!’
అనగా అరుంధతీ, అనసూయ, సావిత్రి, సీత, ద్రౌపది. ఈ అయిదుగురు స్త్రీ మూర్తులు సదా వందనీయులని తెలుస్తున్నది. అరుంధతిదేవి పతివ్రతలలో అగ్రగామి. ఈమె చరిత్రను స్మరించి నంతనే పుణ్యం కలుగుతుందని ‘నైమిసంహిత’ పేర్కొంటోంది.
ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసం కల్పంతో అత్యంత తేజోవితయైన ఒక కన్యను, వర్ణింపనలవికాని ఒక సుందరుని సృష్టించాడు. ఆ కన్య పేరు ‘సంధ్య’. యువకుని పే రు ‘మన్మథుడు’. సృష్టికార్యంలో తనకు సాయపడమని చెబుతూ బ్ర హ్మ ఆ యువకునికి అర విందము, అశోకము, చూతము, నవ మల్లిక, నీలోత్పలం అనే అయిదు సమ్మోహన బాణాలను అందిం చాడు. బాణశక్తిని పరీక్షింపదలచిన మన్మథుడు వాటిని బ్రహ్మలో క వాసులపైనే ఎక్కు పెట్టగా బ్రహ్మతో సహా అందరూ అక్కడే ఉన్న ‘సంధ్యాదేవి’ని చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసి గట్టిన వాగ్దేవి ఈశ్వరుని ప్రార్థించగా, స్వామి అక్కడ ప్రత్యక్షమై పరిస్థితిని చక్కబరిచాడు. రెప్పపాటుకాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సృష్టికర్త కోపించి మన్మథు ని ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతా వని శాపం ఇచ్చాడు.
తనవల్లనే కదా ఇంతమం ది నిగ్రహం కోల్పోయారనే అపరాధ భా వంతో సం ధ్యాదేవి చంద్రభా గానదీ తీరంలో తపస్సు పేరి ట తనువు చాలించ దలచి పయనమైపోయింది. అపుడు బ్రహ్మ వశిష్ట మహా మునిని పిలిచి సంధ్యాదేవికి తపోదీక్షను అనుగ్రహించమని కోరగా, వశిష్టుడు ఆమెకు శివ మంత్రానుష్టానమును వివరించి తన ఆశ్రమానికి వెడలిపోయాడు. సంధ్య తదేకనిష్టతో తపమాచరించి శివుని అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకొమ్మనగా, ఆమె ”ఈ లోకంలో సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామ వికారం కలగరాదనే” వరాన్ని అనుగ్రహించమంది. శివుడు ఆమె లోకోపకార దృష్టికి సంతోషించి మరో వరాన్ని కోరుకోమన్నాడు. అపుడు సంధ్య ‘నా భర్త తప్ప పరపురుషుడెవరైనా నన్ను కామదృ ష్టితో చూచినట్లయితే, వారు నపుంసకులుగా మారాలి, అంతే కాక నేను పుట్టగానే అనేకమందికి కామవికారాన్ని కల్గించాను. కాబట్టి ఈ దేహం నశించిపోవాలని కోరింది. శివుడు తథాస్తు! అన్నాడు.
” మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తు న్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్యురాలివై శరీరా న్ని దగ్ధం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండం నుండి నీవు జన్మిస్తావు. నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా తలుస్తావో! అతడే నీ భర్త అవుతాడ”ని చెప్పి అంతర్ధానమయ్యాడు.
సంధ్యాదేవి శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధంచేస్తూ వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నిలో నుంచి ప్రాత: సంధ్య, సా యం సంధ్యలతో ఓ అందమైన స్త్రీ రూపం సృష్టించబడింది. అంద మైన ఆ మహళే అరుంధతి. వశిష్ఠుడు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని తగిన వధువు కొరకు అన్వేషణ ప్రారంభించాడు. తనను పెళ్లిచేసుకునే స్త్రీకి ఓ పరీక్ష పెట్టాడు. అదేంటంటే! ఇసుకతో అన్నం వండటం. ఓ ఇసుక మూటను పట్టుకుని దాన్ని అన్నంగా వండగలిగినవారు ఎవరంటూ సంచారం చేశారు. ఆ సందర్భం లో అరుంధతి, వశిష్టుడి సంకల్పాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నిం చింది. తనకున్న దైవబలంతో ఇసుకను బియ్యంగా మార్చి వండి వడ్డించింది ఆరుంధతి. సంతోషించిన వశిష్ఠుడు ఆమెను వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అయితే తన చేతి కమండలం అరుంధతి కిచ్చి తాను తిరిగివచ్చే వరకూ దాన్ని చూస్తూ ఉండ మని చెప్పి వెళ్లాడు. ఏళ్ల తరబడి అరుంధతి ఆ కమండలాన్నే చూ స్తూ ఉండిపోయింది. అయినా వశిష్ఠుడు తిరిగి రాలేదు. ఎందరో పండితులు, రుషులు ఆమెను చూపు మరల్చమని చెప్పినా చూపు తిప్పలేదామె. చివరకు బ్రహ్మాది దేవతలు దిగివచ్చి ఆమెను కమం డలము నుంచి చూపు మరల్చాలని చెప్పినా వినలేదు. ఇక చేసేది లేక వశిష్టుడిని వెతికితీసుకువచ్చారు. ఆయన రాకతో తన చూపు ను కమండలం నుంచి వశిష్టుడి వైపు మరల్చింది. అప్పుడు బ్రహ్మా దిదేవతల సమక్షంలో అరుంధతిని పెళ్లి చేసుకున్నాడు వశిష్టుడు. అప్పటి నుంచి మనసా, వాచా, కర్మణా వశిష్టుడిని అనుసరించి మహాపతి వ్రతగా నిలిచిపోయింది ఆరుందతి.
సంస్కృత భాషలో ‘అరుం’ అంటే అగ్ని. ‘ధతీ’ అంటే ధరిం చినది అని అర్థం. అగ్ని నుంచి తిరిగి పుట్టింది కాబట్టి ఆమె అరుం ధతీ అని పిలుస్తారు. అరుంధతి-వశిష్టుడు దంపతులకు పుట్టిన వాడే ‘శక్తి, శక్తికి పరాశరుడు, పరాశరునకు వ్యాసుడు జన్మించారు. అరుంధతిని మనవారు ‘ఆరని జ్యోతి’ అని ‘అరంజ్యోతి’ అని పిలుస్తూంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement