సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం ఆషాడపౌర్ణమిని పురస్కరించుకొని సిరులొలికించే సింహా ద్రినాధుడుకి ఆఖరి విడ తగా మూడు మణుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పిం చను న్నారు. సింహాద్రినాధుడు నిరంతరం చందనధారిగా భక్తులకు దర్శనమిస్తారు. ఏడాది పొడవున సుగంద భరిత చందనంలో ఉండే స్వామి ఒక్క వైశాఖ శుద్ధ తది యనాడు మాత్రమే భక్తులకు తన నిజరూపదర్శనం గావిస్తారు. దీనినే భక్తులంతా చందనోత్స వంగా , చందనయాత్రగా పిలవడం జరుగుతుంది. ఆ రోజు ఉద యం నుంచి రాత్రి వరకు భక్తులకు స్వామి నిజరూపదర్శన భాగ్యం కల్పిస్తారు. అనంతరం వివిధ రకాల ఫల, పుష్ప శీతలా దులతో కూడిన సహస్రఘటాభిషేకం నిర్వహించి తదుపరి స్వామికి తొలివిడతగా అదే రోజు మూడు మణుగుల చందనాన్ని సమర్పిస్తారు. అనంతరం వచ్చే వైశాఖ, జ్యేష్ట, ఆషాడ పౌర్ణమిల లో ఇలా ఏడాది పొడవున నాలుగు విడతల కింద 12 మణుగుల చందనాన్ని (500కేజీలు) సమర్పించడం ఆనవాయితీగా వస్తుం ది. ఈ నేపధ్యంలోనే బుధవారం ఆషాడ పౌర్ణమి పురస్క రించుకొని ఆఖరి విడతగా సింహాద్రినా దుడికి మూడు మణుగుల చందనాన్ని శాస్త్రోక్తంగా సమర్పించనున్నారు. ఇందు కోసం ఆలయ ఇవో ఎం.వి.సూర్యకళ ఆధ్వ ర్యంలో అర్చక వర్గాలు ఇప్పటికే మూడు మణుగుల పచ్చిచందనాన్ని సిద్ధం చేశారు. సుగంధ ద్రవ్యాలు చందనంలో మిలితం చేసి ఆలయ భాండాగారంలో భద్రపరి చారు. ఆషాడ పౌర్ణమి రోజు చందన సమర్పణ గావిస్తారు. తదుపరి శ్రావణ పౌర్ణమి రోజున కరాళ చందన సమర్పణతో మొత్తం చందన సమర్పణ పూర్తి కావస్తుంది. ఆ రోజు కొద్దిపాటి చందనంతో స్వామిని అందంగా నిత్యరూపంలో తయారు చేస్తారు. ఇక అక్కడ నుంచి వచ్చే వైశాఖ శుద్ధ తదియనా డు వరకు సింహాద్రినాధుడు భక్తులకు నిత్యరూపంలోనే చందనధారిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ నేపధ్యంలోనే వైధిక అర్చక వర్గాలు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశాయి. ఆషాడ పౌర్ణమి , గిరిప్రద క్షిణ నేప ధ్యంలో సింహగిరికి వచ్చే భక్తులు తాకిడి అధికంగా ఉంటుంది. అందుకు తగ్గట్లుగా సదుపాయాలు కల్పించేందుకు ఆలయ వర్గాలు భారీ ఏర్పాట్లు పూర్తి చేశాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement