Friday, November 22, 2024

సింహగిరిపై రేపు అప్పన్న తెప్పోత్సవం

విశాఖపట్నం(సింహాచలం), ప్రభన్యూస్‌ బ్యూరో: సింహా చలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మంగళవా రం సింహాద్రినాధుడు తెప్పోత్సవం (తెప్పతిరునాళ్లు) ఉత్సవా న్ని అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతీఏటా పుష్య బహుళ అమావాస్యరోజున సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ ఏడాది కోవిడ్‌ కారణంగా ఆలయ వెనుక భాగంలో ఉన్న నీటి కొలనులో కనులపండువుగా జరిపించను న్నారు. ఉత్సవంలో భాగంగా సింహాద్రినాధుడిని అందంగా వేణుగోపాల స్వామి అలంకరణలో తీర్చిదిద్దనున్నారు. శ్రీదేవి, భూదేవి ఉభయదేవేరులతో కూడిన స్వామిని సర్వాంగ సుంద రంగా తీర్చిదిద్దిన పల్లకిలో ఆశీనులను చేసి వేద మంత్రోశ్చరణలు నడుమ మృదుమధుర మంగళవాయిద్యాల మధ్య తెప్పోత్సవా న్ని జరిపించనున్నారు. ఉత్సవానికి సంబంధించి ఆలయ ఇవో ఎం.వి.సూర్యకళ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంత రం సింహగిరిపై ఉన్న మాడ వీధుల్లో సింహాద్రినాధుడు, శ్రీదేవి, భూదేవి తో తిరువీది నిర్వహించనున్నారు. కోవిడ్‌ లేని పక్షంలో ప్రతీ ఏటా ఈ ఉత్సవాన్ని కొండ దిగువున వరాహ పుష్కరణిలో వేలాది మంది భక్తుల సమక్షంలో కనుల పండుగగా జరిపేవారు. అయితే ఈ ఏడాది సింహగిరిపైనే అప్పన్న తెప్పోత్సవం జరిపిం చనున్నారు. ఉత్సవానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఆలయ వర్గాలు అలంకరణకు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement