Friday, November 8, 2024

అప్పన్న స్వామి నిజరూప దర్శనం!

విశాఖపట్నం సమీపంలో తూర్పుకనుమల్లోని సింహగిరిపై ప్రకృతి ఒడిలో కొలు వైనారు శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు. తెలుగు ప్రజలు ప్రేమగా స్వామిని సింహాద్రి అప్పన్న అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ క్షేత్రంలో స్వామి నిజరూప దర్శనం సంవత్సరం ఒకే ఒక్క రోజు. అది కూడా 12 గంటలు మాత్రమే వైశాఖమాసంలో వచ్చే అక్షయ తృతీయ రోజైన ఈరోజు మాత్రమే! మిగిలిన కాలం అంతా శివలింగ రూపం లో చందనం పూతతో కనిపించే ఈ స్వామి మహిమలు చెప్పనలవి కాదు.
హరిభక్తుడైన ప్రహ్లాదుని తండ్రి హరణ్యాక్షుడిని సంహరించిన తరువాత, నరసింహ స్వామి ప్రహ్లాదుని, ”నీకేమి వరము కావాలో కోరుకో” అని అడుగగా ప్రహ్లాదుడు ”స్వామీ మా తండ్రి, పెదతండ్రులను సంహరించిన వాడివైనందున నీ రెండు అవతారాలను కలిపి ఒకే రూపంలో దర్శించే భాగ్యము నాకు కల్పించు” అని ప్రార్ధించగా స్వామి అనుగ్రహంచెను. అందువలననే స్వామిని ”శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి” అంటారు.
ఆలయ స్థలపురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్ట మొదటగా వరాహ నరసింహ స్వామి విగ్రహన్ని ఆరాధించాడు. ఆ తరువాతి కాలంలో చంద్రవంశానికి చెందిన పురూర వుడు అనే రాజు సింహగిరి మీదుగా విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం ముందుకి కదలకుండా బలవంతంగా క్రిందకు ఆకర్షించబడింది. అంతట క్రిందకి దిగి ఈ మహత్తు గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్న ఆ మహారాజుకు సమీపంలోని ఒక పుట్టలో కప్ప బడి ఉన్న శ్రీ వరాహనరసింహస్వామి కనిపించా డు. ఈ సందర్భంలో గుడి ఈ గిరి మీదనే నిర్మిం చాలని విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజ రూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకా శవాణి పురూరవుడికి చెబుతుంది. ఆ మేరకు పురూరవుడు వరాహ నరసింహ స్వామికి అక్కడే దేవాలయాన్ని నిర్మించాడు.
అంతట పురూరవునకు కలలో కనిపించిన స్వామి ”ఇంతకాలము తనపై ఉన్న మట్టి కప్పబడి ఉన్నందు వలన తన శరీరమునకు తాపము లేద ని, కనుక ఎంత మట్టిని పుట్టలో ఉన్న తన పైనుండి తొలగించారో అంతే పరిమాణం లో తనపై చందనం పూతగా వేసి తనకు తాప ము కలుగకుండా చందనం పూయవలెనని చెప్పెనట. ఈమేరకు పుట్టను తవ్వి తీసిన మట్టి 12 మణుగులు బరువున్న కారణంగా, నాటి నుం డి అంతే పరిమాణంగల చందనమును సంవత్సరం లో స్వామివారికి నాలుగు విడతలుగా విడతకు మూడు

మణుగుల చొప్పున వేస్తున్నా రు. ఈ రోజు 12 మణుగు ల చందనాన్ని తొలగించి 12 గం టలపాటు నిజదర్శనం కల్పించిన అనంత రం అదే రోజు తొలిసారిగా, వైశాఖ పూర్ణమి నాడు రెండవ సారి, జ్యేష్ట పూర్ణిమ రోజు మూడు, ఆషాడపూర్ణిమ రోజు నాల్గవసారి చందనాన్ని మూడు మణులు చొప్పున స్వామివారికి పూసి తాపం చల్ల బర్చుతారు. ఆ సాంప్రదాయం ఆనాటి నుండి నేటికిని కొనసాగు తోంది. ముఖ్యంగా ఈ స్వామి ప్రహ్లాదుడుకి ప్రసాదించిన వరం ప్రకా రం వరాహం, నరుడు, సింహం రూపాలు కలిసిన ఈ నరసింహుని నిజరూపం త్రిభంగ ముద్రలో ‘వరాహంతల’, ‘సింహం తోక’ కలిగిన మనిషి శరీరంతో ఉంటుంది. నిటారుగా నిల్చొని, నడుము దగ్గర ఒక పక్కకు ఒంగి, తిరిగి మెడను నిటారుగా ఉంచడమే త్రిభంగి భంగిమ.
ఇక్కడ కప్ప స్తంభం ఉంది. సంతానం లేనివారు దీన్ని కౌగిలించు కొంటే సంతానం కలుగుతుందని, కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. స్వామి వారిపై పూసిన 12 మణుగుల చందనాన్ని తొలగించ గానే స్వామి విగ్రహం నుండి విస్తరించే ఆవిరి ఎత్తుగా వుండే గర్భగుడి పైభాగంలో కూడా ఆవరించి బొట్లు బొట్లుగా పడతాయనేది స్వయం గా నేను కూడా దర్శించి అనుభవించి అవ్యాజానుభూతిని పొందాను కూడా. ఈ తొలగించిన చందనాన్ని ప్రసాదంగా పంపిణీ చేస్తారు. ఆ చందనాన్ని ఒక చిన్నముక్క నీటిలో కలిపి సేవిస్తే దీర్ఘకాల శారీరక రుగ్మ తలు తొలగి ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

  • చలాది పూర్ణచంద్రరావు
    9491545699
Advertisement

తాజా వార్తలు

Advertisement