మహావిష్ణువు రెండు అవతారాలు కలసి ఉన్న అ రుదైన వైష్ణవ పుణ్యక్షేత్రం సింహాచలం. ఇక్కడ ఒక స్వామి వరాహ నరసింహస్వామి కా గా, రెండవస్వామి లక్ష్మీనరసింహస్వామి. రెండిం టినీ కలిసి శ్రీవరాహ లక్ష్మీనరసింహస్వామిగా కొలుస్తారు. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ) రోజు చందనోత్సవం నిర్వహిస్తారు. సింహాచలం నరసింహస్వామిని నిరంతరం చందనంతో కప్పి వుంచుతా రు. రుద్ర రూపుడైన ఆయన విగ్రహం నుంచి వెలువడుతున్న వేడిని చల్లబరచడానికి నిరంతరం చందనం లేపనంగా పూస్తూ వుంటారని చెబుతారు. ఏడాదిలో ఒకసారి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనాన్ని పూర్తిగా తొలగిస్తారు. తెల్లవారితే అక్షయ తృతీయ అనగా అర్థరాత్రి నుం చే బంగారు బొరుగులతో స్వామివారి మీద ఉన్న చందనాన్ని తొలగిస్తారు. తరువాత తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు అందుబాటు లో ఉంటుంది. స్వామి వారిని తొలిగా దర్శించుకునే అవకాశం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులకు లభిస్తుంది. కేవలం 12 గంటల సమయం మాత్రమే స్వామి వారి నిజరూపాన్ని చూసే అవకాశాన్ని భక్తులకు కలిగిస్తారు. దీనిని చందనోత్సవం, చందన యాత్ర అని పిలు స్తారు. సింహాచలంలో జరిగే అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ఉత్సవం.
చందనోత్సవానికి కొన్ని రోజుల ముందే ఈ ఉత్సవాన్ని ప్రత్యేక పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ దేవాలయం లోని పూజారులు స్వామివారికి కొత్త చందనపు లేపనం కోసం తమిళ నాడులోని మారు మూల ప్రదేశం నుంచి తెప్పించిన జాజిపోకల అనే మేలురకం గంధపు చెక్కల నుంచి గంధాన్ని తీసే ప్రక్రియ ను మొదలుపెడతారు. అలా తీసిన చందనాన్నే 12 గంటల నిజరూప దర్శనం ముగిసిన తర్వాత స్వామి వారికి సమ ర్పిస్తారు. నిజరూప దర్శనం ముగిసిన తర్వాత సింహాచలం కొండమీద వున్న గంగధార నుం చి 1008 కలశాలతో నీటిని తీసుకొచ్చి వైష్ణవ స్వాములు నృసింహ స్వామివారి నిజ రూపానికి అభిషేకిస్తారు. ఆ తరువాత 108 వెండి కలశాలతో స్వామి వారికి పంచామృత అభిషే కాన్ని నిర్వహిస్తారు. అనంతరం ప్రధాన అర్చకులు స్వామివారికి తొలి విడత చందనం మూడు మణుగులు అంటే సుమారు 120 కిలోల చందన లేపనాన్ని సమర్పిస్తారు. ఆ చంద నంతో స్వామివారు నిజరూపం నుంచి నిత్య రూపంలోకి మారతారు.
నిజరూప దర్శనంలో…
ఇక్కడ స్వామివారు 4 రూపాల్లో ఉంటారు. వరాహం, నరు డు, సింహం రూపాలు కలగలసిన అవతారం కేవలం చందనం తీసినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. దీన్నే నిజరూప దర్శనం అంటారు. ఈ రూపంలో వరాహ తల, మనిషి శరీరం, సింహం తోకతో త్రిభంగ ఆసనంలో వరాహ నరసింహస్వామి అవతారం ఉంటుంది. సంవ త్సరం మొత్తం చందనంతో కప్పివున్న స్వామివారి రూపం నాలుగోది.