నెల్లూరుకు చెందిన విజన్ ఆటో మొబైల్స్ మేనేజింగ్ పార్టనర్ పూర్ణచంద్ రూ.3.06 లక్షల విలువైన అపే క్లాసిక్ 435సిసి (డీజీల్) ఆటోను టీటీడీ కి అందజేశారు. శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో దాత ఈ మేరకు ఆటో తాళాలను శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌బాబుకు అందజేశారు. తిరుమల శ్రీవారికి భక్తులు బంగారం, డబ్బులతో పాటూ వాహనాలను కూడా అందజేస్తుంటారు. గతంలో పలువురు భక్తులు స్వామివారికి లారీలు, కార్లు, బైక్‌లు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ వాహనాలను టీటీడీలో సేవల కోసం ఉపయోగిస్తారు. కాగా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం 69,814మంది భక్తుల శ్రీవారిని దర్శించుకున్నారు. 29,228మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. హుండీకి రూ.4.17 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ తెలిపింది. 31 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వ దర్శనానికి 36 గంటల సమయం పడుతోంది.
టిటిడికి విరాళంగా రూ.3.06 లక్షల విలువైన అపే క్లాసిక్ 435సిసి (డీజీల్) ఆటో
Advertisement
తాజా వార్తలు
Advertisement