Monday, November 18, 2024

అనుకరణ ఫలం!

ఒక రోజు ఓ బ్రాహ్మణుడు గంగా స్నానానికి వచ్చాడు. త ను స్నానం చేసి వచ్చేవరకు తన రాగి చెంబును భద్రపరచాలి ఎ లా? అని ఆలోచించాడు.
మంచి ఆలోచనొకటి తట్టింది. అప్పటికి గంగ ఒడ్డున ఎవ రూ లేరు. జాగ్రత్తగా బ్రా#హ్మణుడు ఒడ్డున ఉన్న ఇసుకలో ఒక గొయ్యి త్రవ్వి , అందులో తన రాగి చెంబు యుంచి గొయ్యి పూడ్చివేశాడు. అయితే ”అంత పెద్ద నదీ తీరములో తాను చెం బు యెక్కడ పెట్టాడో కనుక్కోవడం ఎలా?” అనే అనుమానం వచ్చింది.
వెనువెంటనే మరొక దివ్యమైన ఆలోచన మెదిలింది. వెం టనే చెంబు ఉంచిన చోట పైన ఇసుకతో ఒక లింగము చేసి గుర్తుగా పెట్టుకున్నాడు. అతడు స్నానమునకు వెళ్ళగానే మరి కొందరు గంగా స్నానానికై వచ్చారు.
వారు ఈ లింగమును చూచి, స్నానము చేయటానికి ముం దు గంగ ఒడ్దున తప్పక ఇసుకతో ఒక లింగము చేసి స్నానము చేయాలి కాబోలు, అలాంటి నియమం ఉండబట్టే ఇక్కడ ఇసుక లింగము చేసినట్లున్నారని, ఒక్కొక్కరు ఒక్కొక్క లింగము చేసి ఉంచారు. ఇంతలో మరో బృందము స్నానానికై వచ్చింది.
వారు కూడా ఈ తంతు గమనించి తలా ఒక లింగాన్ని తీర ములో చేసి స్నానానికి వెళ్లారు. స్నానమాచరించిన బ్రా#హ్మణు డు ఒడ్డుకు వచ్చేసరికి తీరమంతటా ఎన్నో లింగాలు కనిపిం చాయి. తను చేసిన లింగము, తను చెంబు నుంచిన ప్రదేశము కనిపెట్టలేని ఆ బ్రాహ్మణుడు బాధపడుతూ ఈ శ్లోకం చెప్పాడు
గతానుగతికో లోక: న లోక: పారమార్థిక:|
గంగాసైకతలింగేన నష్టం మే తామ్రభాజనమ్‌||

విషయము తెలుసుకోకుండా ఒకరాచరించిన పనిని ఒకరి తరువాత ఒకరు గ్రుడ్డిగా అనుకరించడం వలన ఈ బ్రా#హ్మణు డు తన చెంబును కోల్పోవడానికి కారణమైనది. ఇలాంటి ప్రవ ర్తన సర్వసామాన్యము.
లోకంలోని వారంతా ఎలాంటి వారంటే ముందువారు ఏం చేశారో వెనుకవారు దాన్నిఅలాగే అనుసరించడం అలవాటై పోయింది. అప్పుడు ఆ గంగమ్మ తల్లి ఆ బ్రాహ్మణుడు కి బం గారు చెంబుని ప్రసాదిస్తుంది. ఆ బ్రాహ్మణుని దు:ఖాన్ని తొలగి స్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement