Wednesday, November 20, 2024

సమాధానాలు తెలియని… ప్రశ్నలు…

ఓ వ్యక్తి రైల్వేస్టేషన్‌కి వెళ్లాడు. స్టేషన్లో అటునుంచి యిటు, యిటు నుంచి అటు తిరుగుతున్నాడు. ఆదుర్దాగా ఉన్నాడు. ఆందోళన పడుతున్నాడు. ఏదో ఆలోచిస్తున్నాడు. ఏమిటేమిటో చేస్తూ పనీ పాటా లేని వాడి లా ఉన్నాడు. ముతక గడ్డం, మాసిన బట్టలు, తైల సంస్కారం లేని జుట్టు, చేతిలో ఓ పుస్తకంతో, అటూయిటూ ఏదోలా చూ స్తున్నాడు. ఆ చూపులో ఎన్నో ప్రశ్నలు. ఎన్నెన్నో సందేహాలు.. సమాధానాలు దొరకని అయోమయం.. ఆత్రం అతని ముఖం లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెరసి ఆందోళనకు.. అసంతృ ప్తికి… అసహనానికి ప్రతీకలా ఉన్నాడతను.
అతడిని ఓ పెద్దాయన చూసాడు. అతని అవస్థని గ్రహంచాడు. సహాయపడదామని అతని దగ్గరకు వెళ్ళి అతడ్ని మాటల్లోకి దించాడు. అతను పెద్దాయనతో మాట్లాడటానికి అయిష్టంగా ఉన్నాడు. ”ఎక్కడకు వెళ్ళాలి?” అని పెద్దాయన అతనిని అడిగాడు.
”తెలియదు” అని అతను సమాధానం చెప్పాడు. పెద్దా యనను తప్పించుకోవాలని అతను ప్రయత్నిస్తుంటే, ”ఎక్కడ నుంచి వచ్చారు?” అని మరో ప్రశ్న అడిగాడు పెద్దాయన.
”తెలియదు” ముక్తసరిగా సమాధానమిచ్చాడు అతను. ”ఇక్కడ ఎందుకు ఉన్నారు?” పెద్దాయన మరో ప్రశ్న.
”తెలియదు” అతని సమాధానం.
”ఏమి చేస్తున్నారిక్కడ?” పెద్దాయన ప్రశ్నించాడు.
”తెలియదు” ఆ వ్యక్తి చెప్పాడు.
”ఎందుకు వచ్చారు ఇక్కడకి?” పెద్దాయన మరో ప్రశ్న.
”తెలియదు” అతని సమాధానం.
మార్చిమార్చి పెద్దాయన ఎన్నో ప్రశ్నలు వేసాడు. ప్రతి ప్రశ్నకు తెలీదనే అతని సమాధానం. ప్రశ్నలే మారుతున్నా యి. సమాధానం మాత్రం తెలీదనే. పెద్దాయనకు విసుగొ చ్చింది. ఈ ప్రశ్నకైనా సమాధానం సరిగా చెప్పగలడనే ఉద్దేశంతో, ”ఇంతకీ మీరెవరు?” అని అడిగాడు.
బేల చూపులు చూస్తూ, అమాయకంగా మళ్ళీ ”తెలియ దు” అనే సమాధానమే వచ్చింది అతడి నుంచి.
అతడిని చూస్తుంటే పెద్దాయనకు జాలి వేసింది. సహాయ పడాలని అనుకున్నా, ఆ అవకాశం ఇవ్వని అతని అవస్థని చూసి, చేసేదేమీ లేక మిన్నకుండిపోయాడు పెద్దాయన.
అలాంటి వ్యక్తి మనకు తారసపడితే పాపం మతిస్థిమితం లేదు అనుకుంటాం. బాధపడతాం. అతను పిచ్చిగా చూస్తు న్నాడు. గాల్లో చేతులూపుతూ, గాలితో వేళ్ళతో ఏవేవో రాస్తూ ఆలోచిస్తున్నాడు. సమాధానాలు దొరకని ప్రశ్నలతో సతమత మవుతున్నాడు.
ఆ వ్యక్తి యెవరో కాదు. నువ్వు… నేను… అతను…. ఆమె… మొత్తంగా మనం… మనమందరమూ…. ఎక్కడ నుం చి ఇక్కడికి వచ్చామో తెలీదు. భూమి మీదకు ఎందుకొచ్చా మో తెలియదు. భూమ్మీంచి ఎక్కడకు వెళ్ళాలో తెలీదు. ఎక్కడకు వెళ్తామో తెలీదు. ఎంత కాలం ఇక్కడ ఉంటామో తెలియదు. ఆఖ రుకి మనం ఎవరిమో కూడా తెలీదు.
ప్రశ్నలే అన్నీ. దేనికీ సమాధానం తెలియదు. ఏవేవో చేస్తాం. ఏవేవో చేస్తూ ఏమోమో అనుకుంటాం. ఎందుకు చేస్తు న్నామో, దేనికోసం చేస్తున్నామో తెలియదు. ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. ఏదోలా బ్రతుకుతుంటాం. బ్రతికేస్తూ ఉం టాం. ఎందు కు బ్రతుకుతున్నామో తెలియదు. అంతా తెలు సు అనుకుంటాం. ఎందుకు? ఏమిటి? ఎలా? ఎప్పుడు? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియక తికమకపడతాం. తెల్ల మొహం వేస్తాం . లక్షణం తెలియదు. లక్ష్యం తెలియదు. గమనం తెలి యదు. గమ్యం తెలియదు. గమనం నిర్దేశించు కోలేని, గమ్యం తెలియని అయోమయ స్థితి, అగమ్యగోచర పరిస్థితి మనది . మనందరిదీ.
పై ప్రశ్నలు మామూలు ప్రశ్నలులా అనిపిస్తాయి. కానీ యివి చాలా కష్టమైన క్లిష్టమైన ప్రశ్నలు. ఓ మహత్తరమైన తత్వం, మహోత్తరమైన తాత్వికత, అనిర్వచనీయమైన అవ్య క్తమైన ఆధ్యాత్మికత మిళితమైన ప్రశ్నలు యివి. నిగూఢమైన తత్వం దాగుండే జటిలమైన సందేహాలివి. సత్యం, తత్వం, తాత్వికత కలగలిసిన, పారమార్థిక తత్వానికి సంబంధించిన ప్రశ్నలివి. పరార్ధాలను, పర అర్ధాలను అన్వేషింపజేసే ప్రశ్న లివి. సమాధానాల కోసం ఓ నిర్దిష్టమైన సాధన చేయాలి. సాధనాక్రమంలో ఉదయించే, జ్వలించే, జ్ఞానాగ్నిలో, యీ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలి. తెలుసుకోవటం మనందరి కర్తవ్యం. తెలుసుకోగలగటం మనందరి లక్ష్యం కావాలి. ఆధ్యాత్మిక మార్గం మనల్ని ఆ గమ్యానికి చేరవేస్తుం ది. చేరువయ్యేలా చేస్తుంది. అయితే పై ప్రశ్నలకు సమాధానా లు, మన జీవిత కాలంలోనే తెలుసుకోవాలి. తెలుసుకో గల గాలి. పరత్వానికి, పరతత్వానికి, పరమాత్మ తత్త్వానికి సంబం ధించిన అంశాలను సాధనతో సముపార్జించుకోవాలి. ఇందుకోసం మహనీయులను మహాత్ములను అనుకరిం చాలి. అనుసరించాలి. అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇందుకోసం గురువులను, గురు పాదాలను, గురు పరం పరను మనసా వాచా ఆశ్రయించాలి. గురు పరంపర అందించే అనుగ్రహం పొందాలి.

– రమాప్రసాద్‌ ఆదిభట్ల
93480 06669

Advertisement

తాజా వార్తలు

Advertisement