Tuesday, November 19, 2024

ఆదర్శనీయ చరితుడు అంశుమంతుడు!

‘సగర చక్రవర్తి’ మనుమడు అంశుమంతుడు. సగరుని పుత్రుడైన ‘అసమంజుసుని’ కుమా రుడు. అత్యంత నీతిమంతుడు. యోగ్యుడు. తాత సగరుడి ఏ పని చెప్పినా చేస్తూ అందరికీ ఆదర్శనీయంగా వుండేవాడు. సగరుడు నిర్వహించిన నూరవ అశ్వమేథ యాగాశ్వాన్ని ఇంద్రుడు పట్టుకెళ్ళి నాగలోకం లోగల ‘కపిల మహర్షి’ చెంత కట్టి వెళతాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం సగరుని అరవైవేలమంది కుమారులు యాగాశ్వానికై అన్ని దిక్కులలో వెదుకుతారు. కనిపించదు. ఇక పాతాళలోకం ఒక్కటే మిగిలి వుంది. అందుకని అందరూ కలిసి భూమిని తవ్వి పాతాళ లోకానికి వెళతారు. అక్కడ ఈశాన్య దిక్కున కపిల మహర్షి సమీపంలో గుర్రం ఉండటాన్ని చూస్తారు. కపి ల మహర్షియే యాగాశ్వా న్నిదొంగిలించాడని ఆయన పైకి ఆయుధాలతో వెళతా రు. మహర్షి కళ్ళు తెరిచి చూ స్తాడు. సగర పుత్రులంద రూ అతని కోపాగ్నికి, వారు చేసిన దోషంతో వారి శరీరా లలో అగ్నిపుట్టి నాశనమై బూడిద కుప్పలుగా మార తారు. పుత్రులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో సగరు డు మనవడు అంశుమంతుడును యాగాశ్వా న్ని వెదికి తెమ్మని కోరతాడు. తాత కోరిక మేరకు అంశుమంతుడు యాగాశ్వాన్ని వెదికితెచ్చే పనిలో తన తండ్రులు వెళ్ళిన మార్గంలోనే వెళ్ళి వారు త్రవ్విన పెద్ద గొయ్యిలో ప్రకాశించే బూడిద కుప్పల ప్రక్కన ఉన్న గుర్రాన్ని చూస్తాడు. దాని పక్కనే ఉన్న కపిల మహర్షిని చూసి నమస్కరించి ఆయన ఎదురుగా నిలబడతాడు. అంశుమంతుని చూసిన మహర్షి అతనిపై అపారమైన కరుణతో ‘బాల కా! ఈ గుర్రాన్ని మీ తాత దగ్గరకు తీసుకొనిపొమ్ము. అవివేకులైన మీ తండ్రులు బూడిద అయ్యారు. ఈ కుప్పల మీద గంగ ప్రవహిస్తే వారికి మేలు జరుగు తుంది” అని చెబుతాడు. అంశుమంతుడు గుర్రాన్ని తీసుకెళ్ళి తాతకు అప్పగిస్తాడు. సగరుడు యాగాన్ని పూర్తిచేసి, అంశుమంతునికి రాజ్యాన్ని అప్పగించి మోక్షానికి అడవులకు వెళతాడు. అంశుమంతుడు తండ్రులు బూడిద అయిన ప్రదేశానికి ‘దేవనది’ అయిన ‘గంగ’ను తెస్తానని అరణ్యానికి వెళ్ళి తపస్సు చేయలేక దు:ఖంతో మరణిస్తాడు. అంశుమంతుని కొడుకు ‘దిలీపుడు’. దిలీపుని కుమారుడు భగీ రథుడు. భగీరథుడు దేవగంగను భూమిపైకి తీసుకువస్తాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement