శివుడు మొట్టమొదటి సారిగా లింగరూపా న్ని ధరించిన సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు. సముద్ర మథనం తరువాత శ్రీమహా విష్ణువు, బ్రహ్మ దేవుడు నేను గొప్ప అంటే నేను గొప్ప అని తమలోతాము ఘర్షణ పడుతున్న ప్పుడు వారి కారణంగా మరో ప్రళయం సంభవించకుండా మహాదేవుడు లింగరూపాన్ని పొంది ఆద్యంతాలను కనుగొనమన్నాడు. ఆద్యంతాలులేని లింగ రూపం ముందు విష్ణువు, బ్రహ్మదేవుడు ఓడిపోయారు. గర్వాన్ని విడిచిపెట్టారు. ఆనాడు మాఘ కృష్ణ చతుర్దశి. ఆనాటి రాత్రి శివుడు లింగరూపంలో మొదటిసారిగా దర్శనమిచ్చిన కారణంగా మాఘ కృష్ణ చతుర్దశి రాత్రి 11 గంటల తరువాతి కాలాన్ని లింగోద్భవ కాలం అంటారు. మహాదేవుడు సర్వప్రాణులలోనూ ఆత్మరూపం గా నిలిచి ఉంటాడు. అటువంటి స్వామి మహాశివరాత్రి నాడు పార్థివ లింగంగా దర్శనమిస్తాడు. శివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో బిల్వప్రతాలతో పూజించి పంచామృతాలతో అభిషేకిస్తే సంవ త్సర కాలం నిత్య శివారాధన ఫలితం కలుగుతుంది. శివరాత్రి నాడు అన్ని పుణ్యనదులు బిల్వ మూలంలో ఉంటాయని శాస్త్రం చెబుతుంది. అందుకని లింగోద్భవకాలంలో బిల్వపత్రాలతో పూ జించడం, అభిషేకించడం అత్యంత లాభదాయకం. ఐశ్వర్యదాయకం. పుణ్యప్రదం.
Advertisement
తాజా వార్తలు
Advertisement