రాగం : మాళవగౌళ
నిమిషమెడతెగక హఱి నిన్ను తలచి
మమత నీ మేదనే మరపి బ్రతుకుటగాక|| ||నిమిష మెడతెగక||
నిదురచే కొన్నాళ్ళు నేరముల కొన్నాళ్ళు
ముదిమిచే కొన్నాళ్ళు మోసపోయి
కదిసి కోరినను గతకాలంబు వచ్చునే
మది మదినె యుండి ఏమరక బతుకుట గాక|| ||నిమిష మెడతెగక||
కడు నతయులకు కొంత కాంతలకు నొక కొంత
వెడయాసలకు కొంత వెట్టిసే సి
అడరి కావలెననిన అందు సుఖమున్నదా
చెడక నీ సేవలే సేసి బుతుకుటగాక|| ||నిమిష మెడతెగక||
ధనము వెంట తగిలి ధాన్యంబునకు తగిలి
తనవారి తగిలి కాతరుడైనను
కను కలిగి శ్రీ వేంకటనాథ కాతువే
కొనసాగి నిన్ను నే కొలిచి బతుకుటగాక|| ||నిమిష మెడతెగక||