Sunday, November 17, 2024

అన్నమయ్య కీర్తనలు : అదె చూడర య్య

రాగం : బౌళి

అదె చూడరయ్య పెద్ద హనుమంతుని
గుదిగొని దేవలతు కొనియాడేరయ్య|| || అదె చూడరయ్య||

ఉదయాస్తశైలములు ఒక జంగగా చాచె
అదివో ధృవమండల మందె శిరసు
చదివె సూర్యుని వెంట సారె మొగము ద్రిప్పుచు
ఎదుట ఈతని మహిమ యేమని చెప్పేమయ్యా|| || అదె చూడరయ్య||

దండిగా బ్రహ్మాండము దాక తోకమీదికెతై
మెండగు దిక్కుల నిండా మేను వెంచెను
గుండు గూడ రాకాసుల కొట్టగ చేతులు చాచె
అండ ఈతని ప్రతాప మరుదరుదయ్యా|| || అదె చూడరయ్య||

దిక్కులు పిక్కటిల్లగ దేళహరోమములు పెంచె
పక్కన లోకములకు ప్రాణమె నిల్చె
ఇక్కడ శ్రీ వేంకటేశు హితవరి బంటాయ
మిక్కిలి ఈతని లావు మేలు మేలయ్య|| || అదె చూడరయ్య||

Advertisement

తాజా వార్తలు

Advertisement