Tuesday, November 26, 2024

అన్నమయ్య వాగ్గేయ నవనీతం…వేంకటాద్రి కృష్ణతత్వం!

పాపడుగా నట్టింట పాకుతూ భాగవతం చేపట్టి, హరి నామాన్ని ఆలకిస్తూ అమ్మ చేతి ముద్దలు తిన్నవాడికి పరమాత్మ పరతత్వం బోధపడింది. కటి వరద హస్తాలతో సప్తగిరిపై కొలువున్న కోనేటి రాయుడు. వేద పురాణాలలో విహరించే దేవదేవునిలా యోగి స్వరూపులైన గోపికల కౌగిళ్ళలో చిక్కిన మురహరునిలా యశోదకు చిన్నిశిశువులా కనిపించాడు. భావయామి గోపాలబాలం అని భజించి, ముద్దుగారే యశోద ముంగిట ముద్దుగారే బాలకృష్ణుని కీర్తించి జ్యోఅత్యుతానంద జోజోముకుంద అని వటపత్రంపై పవ ళించు చిన్న శిశువుని దర్శించి. పరమపురుషుని పరతత్వాని పరవశించేటట్లు పదార్చన చేసిన పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు.
అన్నమయ్య అనగానే కళ్లముందు కనబడేది ఆ ఏడుకొండలవాడి మంగళకర స్వరూ పం. వేంకటాద్రిరాయడి కలియుగ అవతార పురుషునిగా భక్తజన సందోహం గుండెల మీద కు చేదిన ఘనత మాత్రం నిశ్చయంగా తాళ్లపాకవారి సంకీర్తన గానామృత వైశిష్ట్యానిదే! అడుగడుగుల వాడిని ఎన్నిందాల ప్రదర్శించ తగునో, అన్నిందాలా హుందాగా ప్రదర్శించి చూపించిన ప్రతిభ అన్నమయ్య ఘంటానిది, కంఠానిది. ఆ కీర్తిని అజరామరం చేసిన వేలాది సంకీర్తనల్లో కృష్ణ సంబంధమైన సంకీర్తన గానామృతం ఓ గుక్కెడు సేవించడమే ఇక్కడ ముఖ్యోద్దేశం.

అన్నమయ్య కృష్ణ తత్వం

‘ఏదో తెలియని నీలిరూప తత్వం’ అన్నమయ్యనూ వదలకుండా వెన్నంటి మరీ తన్మయత్వంలో ముంచి తేల్చిందని చెప్పుకోవాలి. జయదేవుని అష్టపదులకు దీటై న పాద పంక్తులను ఆ పారవశ్య పరమార్థ చింతనతోనే అన్నమయ్య అత్యద్భుతంగా తీర్చిదిద్దినట్లు ఒప్పుకోవా లి. కన్నయ్య అనగానే మనస్సుకు తటిల్లుమని తట్టేది ఆ నల్లనయ్య కూనరూప లావణ్యం, చిలిపి చేష్టలు. ఆ యదుబాలుని ముద్దు మురిపాలను అన్నమయ్య మథిం చి మరీ కట్టిన కీర్తనల చల్లపై తెడ్డు కట్టిన వెన్నల తరకల రుచి మాటలతో మనసుకు పట్టించడం ‘భావయామి గోపాలబాలం మనస్సేవితం తత్పదం చింతయేహం సదా’ అంటూ… ‘కటి ఘటిత మేఘలా ఖచిత మణి ఘం టికా’- బుజ్జి నడుముకి కట్టిన రత్న ఖచితమైన మొలతా డును తలుచుకుని తనలో తానే సంకీర్తనా పరవశుడై మురిసిపో తాడు అన్నమయ్య వందలొందల పర్యాయాలు.
‘నిరతరకర కలిత నవనీతం బ్రహ్మాది
సురనికర భావనా శోభిత పదం’
వెన్నముద్దతో నిండి ఉండే చిన్నిచిన్ని చేతులుండే ఆబాల గోపాల రూపాన్ని మనసులో భావించుకుంటేనే గాని.. మిగతా దేవతలకు ప్ర్రార్థనలు. సవ్యంగా సాగే పనికాదు!’ అని అన్నమ య్యే తన కృష్ణతత్వ కాంక్షాపరత్వాన్ని నిర్మొహమాటంగా బైటపెట్టిన సన్నివేశాలు ఎన్నో!
‘చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగారు మొలతాడు పట్టుదట్టి’
అన్న పద్యం నోట బట్టని బాలలు తెలుగునేల మీద కనిపిం చడం చాలా అరుదు. ఆ తరహా వెన్నముద్ద వంటి కృష్ణ కీర్తననే అన్నమయ్య మన జిహ్వలకు అందించింది. అనుభవిస్తూ ఆల పిస్తే సాక్షాత్తూ ఆ బుజ్జి కృష్ణుడే తనకు తానై వచ్చి మన గుండెల మీదెక్కి కూర్చుని ఆడుకుంటున్నంత ఆనందం ఖాయం!
‘చిన్ని శిశువు చిన్ని శిశువు
ఎన్నడూ చూడమమ్మ ఇటువంటి శిశువు’ అంటూ కృష్ణయ్య ముద్దుమురిపాలు ఒలికే బాలుని స్వరూపాన్ని కళ్లకు కట్టించే ప్రయత్నం చేసాడు అన్నమయ్య అనేక పర్యాయాలు. అలతి అలతి పదాలతో ఇంత అందమైన వర్ణనలతో మరి మరో కవి ఇంకెవరైనా పాల చారలు తెడ్డు కట్టిన కృష్ణయ్య బుజ్జి బొజ్జ ను గూర్చి కూడా భజించాలన్న బుద్ధి పుట్టిందా? ఏమో.. తెలి యదు. అదే అన్నమయ్యలోని విశిష్టత. ఇళ్లలోని పసిపిల్లలు తాగే పాలను ఒక్కోసారి వంటి మీదకు వంపేసుకున్నప్పుడు చటుక్కున చూసిన వెంటనే ముందు మనకు తెగ ముద్దొచ్చేస్తా రు. బాలుడు భగవంతుడెలాగో.. భగవంతుడూ బాలుడుకు మల్లే అయిపోతాడు కాబోలు ఒక్కోమారు. బ్రహ్మాండ నాయకుడిని ఓ బాల వెన్నదొంగ స్థాయికి దింపి వర్ణించే ఆలోచన అన్నమయ్యకు కలగడం వాస్తవానికి తెలుగు వారి వాగ్గేయ సాహత్య ప్రక్రియ చేసుకున్న ఫలంగా చెప్పుకోవాలి. అన్నమయ ప్రతీ సందర్భంలోనూ కర్ణపేయమైన ఆ సప్తస్వర మిశ్రితాలను తాను విని ఇహ లోకాలూ తన్మయమయేలా వినిపించడం వాగ్గేయ సంగీత విభాగానికి ప్రత్యేక స్వరాలవిందు!
పరగడుపునే పెరుగు చిలికే శబ్దాలు విని లేచి, నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుం టూ వెళ్లి దీపం ఆర్పి మరీ వెన్న దొంగిలించే ఆ కొంటె కృష్ణుడికి మనకు లాగా ఆ చౌర్యం పాపహతువు కాదు. సరికదా, కృష్ణచౌర్య స్మరణం ముక్తిఫలదాయకమని నమ్మి ఎంతో మం ది భక్తి భావుకులు దానినో తత్వం కింద తీర్చిదిద్దారు. అందులో జయదేవుడు, లీలాశుకుడు, మన తెలుగులో పోతనా.. ఆయనకు తోడుగా అన్నమయ్య ఇప్పుడు! మనిషితత్వం కృష్ణతత్వంతో కలగలసిపోయి అన్నమయ్య అత్యద్భుత ఆధ్యాత్మిక సంకీర్తనల సారంగా రూపుదిద్దుకొన్నదనిపిస్తుంది. గోపీజన మానస చోరుడుగా కన్నయ్యకు మరో మనోహర మైన బిరుదు ఎలాగూ ఉంది. క్రౌర్యం, నైచ్యం వంటి మరెన్నో మానసిక బలహనతలు అన్ని టిని చౌర్యం చేసైనా సరే మనిషిని శుద్ధిచేయడం భగవంతుని బాధ్యతగా భాగవతులంతా భావించిన తీరులోనే అన్నమయ్య భావనా వాగ్గేయ మార్గంలో అచ్చమైన తెలుగులో అద్భుతంగా సాగిందనుకోవాలి. కృష్ణ తత్వం ఆసాంతం అన్నమయ్య తెలుగులో చేసిన భావన పరమాద్భుతం. ‘ముద్దుగారె యశోద ముంగిట ముత్యము వీడు’ సంకీర్తనలో అన్నమయ్య ఆ నవరత్నాలను పొదిగిన లాఘవం అమోఘం. యశోదమ్మ ముంగిటి ముత్తెం మరెవరో కాదు.. తిద్దరాని మహమల దేవకీ సుతుడైన బాలకృష్ణుడే! అతగాడే అంత నింత గొల్లెతల అరచేతి మాణిక్యం; పంతమాడే కంసుని పాలిట వజ్రం కూడా అతగాడే. ముల్లోకాలకు కాంతులిచ్చే గరుడ పచ్చపూసట చిన్ని కృష్ణుడు. రతికేళికి ఎదిగే వేళకు ఆ మదనుడే రుక్మిణమ్మ పాలిటి పగడంగా మారాడుట! గోవుల గుంపు మధ్య గోమేధికంలా మెరిసిపోయే నల్లని కృష్ణుడు, శంఖచక్రాలు ధరించినప్పుడు వాటి సందులో వైఢూర్యం లా మెరుపులీనుతాడుట. భక్తజాతికి అంతిమ గతిగా భావించబడే కమలాక్షుడు కాళింగుడ నే సర్పం శిరస్సు మీద కళ్ళు చెదిరే పుష్యరాగం మాదిరి మిరిమిట్లు గొలుపుతాడని, పాలకడ లిలో మెరిసే ఇంద్రనీలంవంటి ఆ శ్రీ వేంకటాద్రి పద్మనాభుడే అన్నెపున్నేలేమీ ఎరుగని పసిబాలుడి మాదిరి మన మధ్యనే పారాడే దివ్యరత్నమని అన్నమయ్య భావించడం కృష్ణతత్వానికి సమర్పించిన నవ్య వాగ్గేయ నవనీత నైవేద్యం.

Advertisement

తాజా వార్తలు

Advertisement