రాగం : షణ్ముఖ ప్రియ
పలువిచారము లేల పరమాత్మ నీవు నాకు
కలవు కలవు ఉన్న కడము లేమిటికి || ||పలువిచారములె
ల||
నీ పాదముల చెంత నిబిడమైతే చాలు
యే పాతకములైన ఏమి సేసును
యేపార నీ భక్తి ఇంత గలిగిన చాలు
పైపై సిరులచ్చట పాదుకొని నిలుచు || ||పలువిచారములేల||
సొరిది నీ శరణము జొచ్చితినంటే చాలు
కరుణించి యప్పుడట్టే కాతువు నీవు
సరుస నీ ముద్రలు భుజముల నుంటే చాలు
అరుదుగా చేతనుండు అఖిలలోకములు || ||పలువిచారములేల||
నేరక వేసినచాలు నీ మీద ఒక పువ్వు
కోరిన కోరికలెల్ల కొనసాగును
మేరతో శ్రీ వేంకటేశ మిమ్ము గొలిచితి నేను
యేరీతి నుండినగాని యిన్నిటా ఘనుడను|| ||పలువిచారములేల||
——