Monday, November 18, 2024

అన్నమయ్య కీర్తనలు : పలుమరు వుట్ల

రాగం : ముఖారి

పలుమరు వుట్ల పండుగను
చిలుకు చిడుక్కని చిందగను || || పలుమరు వుట్ల ||

ఊళ్ళ వీధుల వుట్ల కృష్ణుడు
తాళ్ళు తెగిపడ తన్నగను
పెళ్ళు కఠిల్లు పెఠిల్లు చిఠిల్లని
పెళ్ళుగ మ్రోసె పెనురవము || || పలుమరు వుట్ల ||

బంగరు బిందెల పాలు పెరుగులు
ముంగిట నెగయుచు మోదగను
కంగు కళింగు కఠింగు ఖణింగని
రంగు మీరు పెను రవములై || || పలుమరు వుట్ల ||

నిగ్గుగ వేంకట నిలయుడుట్టి పా-
లగ్గలిక పగుల నడువగను
భగ్గు భగిల్లని పరమామృతములు
గుగ్గిలి పదనుగ కురియగను || || పలుమరు వుట్ల ||

Advertisement

తాజా వార్తలు

Advertisement