రాగం : కేదారగౌళ
పరమాత్ముని నోరబాడుచును ఇరు
దరులు గూడగ దోసి దంచీ మాయ || || పరమాత్ముని ||
కొలది బ్రహ్మాండపు గుందె నలోన
కులుకు జీవులను కొలుచునించి
కలికి దుర్మోహపు రోకలివేసి
తలచి తనువులను దంచీమామ || || పరమాత్ముని ||
తొంగలి రెప్పల రాత్రులు బగలును
సంగడి కన్నులుగా సరిదిప్పుడచు
చెంగలించి దిక్కులనే చేతులూచుచు
దంగుడు బియ్యాలుగా దంచీమాయ || || పరమాత్ముని ||
- Advertisement -
అనయము తిరువేంకటాదీశ్రుని
పనుపడి తనలో బాడుచును
వొనరి విన్నాణి జీవులనెడి బియ్యము
తనర నాతనికియ్య దంచీమాయ || || పరమాత్ముని ||