పరుల సేవలు చేసి బ్రతికేరటా
సరివరుదాసులు సిరులందు టరుదా || || పరుల సేవలు చేసి ||
కోరి వొక నరుని గొలిచినవారలు
ధీరులై సలిగెల దిరిగేరట
కూరిమి బ్రహ్మాండకోటులేలెడివాని-
వార లింతట జనవరులౌ టరుదా || || పరుల సేవలు చేసి ||
చేకొన్న తుమ్మిదచే పడ్డ కీటము-
లాకడ తుమ్మిదలయ్యీనట
శ్రీకాంతుని పాదసేకులగువార –
లేకులజులయినా నెక్కుడౌ టరుదా|| || పరుల సేవలు చేసి ||
ధరణీశునాజ్ఞల తమదేశములందు
సిరులనాణపుముద్ర చెల్లిdనట
తిరువేంకటాద్రి శ్రీదేవుని ముద్రలు
ధరియింపగా నింతట చెల్లుటరుదా|| || పరుల సేవలు చేసి ||