నారాయణాయ నమో నమో
నానాత్మనే నమో నమో|| ||నారాయణాయ నమో నమో||
ఈ రచనలనే ఎవ్వరు తలచిన
ఇహపరమంత్రములిందరికి|| ||నారాయణాయ నమో నమో||
గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమో
భావజగురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమో
దేవేశాయ నమో నమో దివ్యగుణాయ నమో నమో
ఈ వరుసలనే ఎవ్వరు తలచిన ఇహ పరమం త్రము లిందరికి|| ||నారాయణాయ నమో నమో||
దామోదరాయ నమో నమో ధర ణీశాయ నమో నమో
శ్రీ మహిళా పతయే నమో నమో శిష్టరక్షణ నమో నమో
వామనాయ తే నమో నమో వనజాక్షాయ నమో నమో
ఈ మేరలనే ఎవ్వరు తలచిన ఇహపరమంత్రము లిందరికి|| ||నారాయణాయ నమో నమో||
పరిపూర్ణాయ నమో నమో ప్రణవగ్రాయ నమో నమో
చిరంతనా శ్రీ వేంకటనాయక శేషశాయినే నమో నమో
నరకధ్వంసే నమో నమో నరసింహాయ నమో నమో
ఇరవుగ నెవ్వరు దలచిన ఇహపరమంత్రము లిందరికి|| ||నారాయణాయ నమో నమో||
————————————————————————————————