రాగం : ఖరహరప్రియ
పరమయోగీశ్వరుల పద్ధతి ఇది
ధరణిలో వికేకులు తలపోసుకొనుట || ||పరమయోగీశ్వరుల ||
మొదల నాత్మజ్ఞానము తెలిసి పిమ్మట
హృదయములోని హరినెరుగుట
వుదుటైన ఇంద్రియాల నొడిసి వంచుకొనుట
గుదిగొన్న తనలో కోరికెలుడుగుట || ||పరమయోగీశ్వరుల ||
తన పుణ్యఫలములు దైవము కొసగుట
పనివడి అతనిపై భక్తి సేసుట
తనివితో నిరంతర ధ్యానయోగ పరుడౌట
మనసుతో ప్రకృతి సమ్మంధము మరచుట || ||పరమయోగీశ్వరుల ||
నడుమ నడుమ విజ్ఞానపుకథలు వినుట
చిడుముడి నాచార్య సేవ సేయుట
ఎడయక శ్రీవేంకటేశు పై భారము వేసి
కడువైష్టవుల కృప కలిగి సుఖించుట || ||పరమయోగీశ్వరుల ||