Saturday, November 23, 2024

అన్నమయ్య కీర్తనలు : నీ కథామృతము

రాగం : బేగడ
నీ కథామృతము నిరత సేవన నాకు
చేకొనుట సకలసుఖ సేవనంబటు గాన|| ||నీ కథామృతము||

ఇదియె మంత్రరాజము నాకు నేప్రొద్దు
నిదియె వేదసంహిత పాఠము
ఇదియె బహుశాస్త్రమెల్ల చదువుట నాకు
ఇదియె సంధ్య నాకిదియె జపమటు గాన|| ||నీ కథామృతము||

ఇదియె బ్రహ్మవిద్యోపదేశము నాకు
ఇదియె దు:ఖవిరహితమార్గము
ఇదియె బహులోకహిత భేషజము నాకు
ఇదియె వుపనిషద్వాక్యపద్ధతి గాన|| ||నీ కథామృతము||

ఇదియె దానఫలమియ్యజాలును నాకు
ఇదియె తపవిరహిత కర్మము
ఇదియె తిరువేంకశ్వరుని సంస్మరణ
ఇదియె యిదియె యిన్నియును నటు గాన|| ||నీ కథామృతము||

Advertisement

తాజా వార్తలు

Advertisement