Tuesday, November 26, 2024

అన్నమయ్య కీర్తనలు : నీవు తురగము మీద

రాగం : అఠాణా
నీవు తురగము మీద నేర్పుమెరయ
వేవేలు రూపములు వెదచల్లితపుడు|| ||నీవు తురగము మీద||

పదిలముగ నిరువంక పసిడి పింజలయంప
పొదల తరకసములొరపులు నెరపగా
గదయు శంఖంబు చక్రము ధను:ఖడ్గములు
పదివేలు సూర్య బింబములైన వపుడు|| ||నీవు తురగము మీద||

సొరిది శేషుని పెద్దచుట్టు పెనుగే వడము
సిరిదొలక నొకచేత చిత్తగించి
దురమునకు తొడవైన ధూమకేతువు చేత
నివరైన బల్లెమై ఏ చెనందపుడు|| ||నీవు తురగము మీద||

కరకజడతో రమాకాంత జయలక్ష్మియై
తొరలి కౌగిటనిన్ను తొడికిపట్టి
చరచెవెను వేంకటస్వామి నిను గెలువమని
మెరుగు కుచకుంభముల మిసిమితో నపుడు|| ||నీవు తురగము మీద||

Advertisement

తాజా వార్తలు

Advertisement