Thursday, November 21, 2024

అన్నమయ్య కీర్తనలు

ప|| ఏకులజుడేమి యెవ్వడైననేమి
ఆకడ నాతడె హరినె ఱిగినవాడు || ఏకులజుడేమి ||

చ|| పరగిన సత్యసంపన్నుడైన వాడే
పరనిందసేయ తత్పరుడు కాని వాడు
అరుదైన భూతదయానిధి యగువాడే
పరులు తానేయని భావించువాడు || ఏకులజుడేమి ||

చ|| నిర్మలుడై యాత్మనియతి గలుగువాడే
ధర్మతత్పర బుద్ధి తగిలినవాడు
కర్మమార్గములు కడవనివాడే
మర్మమై హరిభక్తి మఱవనివాడు || ఏకులజుడేమి ||

చ|| జగతిపై హితముగా చరియించువాడే
పగలేక మతిలోన బ్రదికినవాడు
తెగి సకలము నాత్మ తెలసినవాడే
తగిలి వెంకటేశు దాసుడయినవాడు || ఏకులజుడేమి ||

Advertisement

తాజా వార్తలు

Advertisement