రాగం : హంసిని
నిన్ను దలంచి నీ పేరు దలచి
నన్ను కరుణించితే నెన్నిక గాక || ||నిన్నుదలంచి నీ పేరు దలచి ||
అధికునికాచు టేమరుదు నన్ను
నధముని కాచుట యరుదుగాక నీకు
మధురమౌటేమరుదు మధురము చేదు
మధురమౌటే మహిలో నరుదుగాక || ||నిన్నుదలంచి నీ పేరు దలచి ||
అనఘుని కరుణింప నరుదుగాదు నీకు
ఘన పాపుని నన్ను కాచు టరుదుగాక
కనకము కనకము కానేల యినుము
కనకమవుటే కడు నరుదుగాక || ||నిన్నుదలంచి నీ పేరు దలచి ||
నెలకొన్న భీతితో నిన్ను చెనకితిగాక
తలకొన్న సుఖినైన దలచనేల నిన్ను
యెలమితో తిరువేంగళేశుడు నాపాల
కలిగి నీకృప కలుగజేతువు గాక || ||నిన్నుదలంచి నీ పేరు దలచి ||