Monday, November 18, 2024

అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు

రాగం : రతిపతిప్రియ

|| సకలలోకేశ్వరులు ||

ప|| సకల లోకేశ్వరులు సరుస చేకొనువాడు
అకలంకముగ పుష్ప యాగంబు || సకలలోకేశ్వరులు ||

చ|| వివిధ పుష్పములతో వేదఘోషములతో
అవల తిరువాముడియు అంగనల ఆటతో
కవి వంది సుతలతో కమ్మ పూజలతోడ
నవధరించీ పుష్ప యాగంబు || సకలలోకేశ్వరులు ||

చ|| కప్పురపుటారతేల ఘనచందనము తోడ
తెప్పల ధూపముల తిరువంది కాపుతో
ఒప్పు(గ) పణ్యారములు వొగి పెక్కువగలతో
అప్పడందీ పుష్పయాగంబు || సకలలోకేశ్వరులు ||

- Advertisement -

చ|| తగు ఛ్రత చామర తాంబూలములతోడ
పగటుతో నీరీతి పది పూజలందుకొని
జిగిమీరె చూడరే శ్రీ వేంకటేశ్వరుని
అగణితంబగు పుష్పయాగంబు || సకలలోకేశ్వరులు ||

Advertisement

తాజా వార్తలు

Advertisement