రాగం : శ్రీ
ప|| ఎంత చదివిన ఏమివినిన తన
చింత ఏలమాను సిరులేల కాలుగు || ఎంతచదవిన ||
చ|| ఇతర దూషణములు ఎడసిన గాక
అతి కాముకుడు కానియప్పుడు గాక
మతి చంచలము కొంతమానినగాక
గతియేల కలుగు దుర్గతు లేలమూను || ఎంతచదవిన ||
చ|| పరధనముల యాస పాసినగాక
అరిది నిందలు లేని యప్పుడు గాక
విరసవ ర్తనము విడిచిన గాక
పరమేల కలుగు నాపద లేలమాను || ఎంతచదవిన ||
చ|| వేంకటపతి నాత్మవెదకిన గాక
కింక మనసున తొలగిన గాక
బొంకుమాట లెడసి పోయినగాక
శంక యేల మాను జయమేల కలుగు || ఎంతచదవిన ||