నరసింహ రామకృష్ణ నమో శ్రీ వేంకటేశ
సరుగ నా శత్రుల సంహరించవే || ||నరసింహ రామకృష్ణ||
బావతి ట్లకు శిశుపాలుని జంపిన –
యేవ కోపకాడవు నేడెందు వోతివి
నీవాడనని నిన్ను నిందించే శత్రువును
చావగొట్టి వాని నిట్టే సంహరించవే || ||నరసింహ రామకృష్ణ||
దాసుని భంగించేటి తరి కస్యపు జంపిన
యీసుకోపగాడ విపు డెందువోతివి
మేసుల నీలాంఛనాలు మించి నన్ను దూషించే
సాహించి శత్రువును సంహరింపవే || ||నరసింహ రామకృష్ణ||
కల్లలాడి గూబయిల్లు గైకొన్న గద్ద జంపిన
యెల్లగాగ కోపకాడ వెందువోతివి
యిల్లిదె శ్రీ వేంకటేశ యీ నీ మీది పాటలు
జల్లన దూషించు శత్రు సంహరిపవే || ||నరసింహ రామకృష్ణ||