రాగం : బిలహరి
ఈతడే హరుడు యీతడే యజుడు
ఈతనికి నీ చేతలెంత ఘనమటుగాన
కడు పెక్కు బ్రహ్మాండకటకముల సుడివడిన
కడుపులో నిడుకొన్నఘనుడు
వెడలి పూతకిచంటి విషము తాగిన యంత
వడిదనకు నేమాయ వట్టిబూమెలుగాక
ఎల్లజలధులు మిగిలి యేకమై పబ్బినపు
డుల్లసిల్లుచు నీతడుండు
మల్లాడి యొక రెండు మద్దులు విరచినట్టి
బల్లిదుదవని నిన్ను పరిణమింతురు గాన
తిరువేంకటేశ్వరుడు దేవ దేవోత్తముడు
పరిపూర్ణుడచ్యుతు డభవుడు
శరణాగతుల రక్షసేయువా డనుమాట
గురుతుగా తలపోసి కొనియాడగా వలసె