రాగం : నాటకురంజి
చూడవయ్య నీ సుదతి విలాసము
వేడుక కాడవు విభుడవు నీవు || ||చూడవయ్య నీ సుదతి ||
పున్నమి వెన్నెల పోగులు పోసి
సన్నపు నవ్వుల జవరాలు
వన్నెల కుంకుమ వసంతమాడీ
ఇన్నిటా కళలతో ఈ మెరుగు బోడి || ||చూడవయ్య నీ సుదతి ||
పాటంచి తుమ్మెద పౌజులు దీర్చీ
కాటుక కన్నుల కలికి యిదే
సూటిజక్కవల జోడలరించీ
నాటకపుగతుల నాభిసరసి || ||చూడవయ్య నీ సుదతి ||
అంగజు రథమున హంసలు నిలిపి
కంగులేని ఘన గజగమన
ఇంగతపు శ్రీ వేంకటేశ నిన్నెనసె
పంగెన సురతపు పల్లవాధరి || ||చూడవయ్య నీ సుదతి ||