రాగం : హిందోళం
వచ్చెను అలమేలు మంగ ఈ
పచ్చల కడియాల పణతి చెలంగ || ||వచ్చెను అలమేలు మంగ||
బంగారు చేదివిటీలు పూఇ
శృంగారవతులు వేవేలు రాగా
రంగైన వింజామరలు నీవ
మాంగల్యలీల సొంపగు జవరాలు || ||వచ్చెను అలమేలు మంగ||
పలుకుల తేనియు లొలుక చెంత
చిలుకలు కలకల పలక రవల
గిలుకు పావలు ముద్దుగులుక మేటి
కలికి చూపుల మొనలు తళుకని చిలుక || ||వచ్చెను అలమేలు మంగ||
రంభాది సతులెల్ల చేరి ఎదుట
గంభీర గతులను మీర నటనా
రంభములను మేలుకోరి కొలువ
అంభోజాక్షుడౌ వేంకటేశు నొయ్యారి || ||వచ్చెను అలమేలు మంగ||