ఈతడే హరుడు
రాగం : బిలహరి
ప|| ఈతడే హరుడు యీతడే యజుడు || ఈతడే హరుడు ||
ఈతనికి నీ చేతలెంత ఘనమటుగాన
చ|| కడు పెక్కు బ్రహ్మాండకటకముల సుడివడిన || ఈతడే హరుడు ||
కడుపులో నిడుకొన్నఘనుడు
వెడలి పూతకిచంటి విషము తాగిన యంత
వడిదనకు నేమాయ వట్టిబూమెలుగాక
చ|| ఎల్లజలధులు మిగిలి యేకమై పబ్బినపు || ఈతడే హరుడు ||
డుల్లసిల్లుచు నీతడుండు
మల్లాడి యొక రెండు మద్దులు విరచినట్టి
బల్లిదుదవని నిన్ను పరిణమింతురు గాన
చ|| తిరువేంకటేశ్వరుడు దేవ దేవోత్తముడు || ఈతడే హరుడు ||
పరిపూర్ణుడచ్యుతు డభవుడు
శరణాగతుల రక్షసేయువా డనుమాట
గురుతుగా తలపోసి కొనియాడగా వలసె