Saturday, November 2, 2024

అన్నమయ్య కీర్తనలు : ఎటువంటి మోహమో

రాగం : సామ

ఎటువంటి మోహమో ఎట్టి తమకమొగాని
తటుకును దేహమంతయు మరచె చెలియ || ||ఎటువంటి మోహమో ||

పలుకు తేనెల కొసరి పసిడి కిన్నెర మీటి
పలుచనెలుగున నిన్ను పాడి పాడి
కలికి కన్నీరు బంగారు పయ్యెద నొలుక
తలయూచి తనలోనె తలవంచు చెలియ || ||ఎటువంటి మోహమో ||

పడతి నీవును తాను పవళించు పరుపుపై
పొడము పరితాపమున పొరలి పొరలి
జడిగొన్న జవ్వాది జారు చెమటల దోగి
ఉడుకు నూరుపుల నుసురుసురాయె చెలియ || ||ఎటువంటి మోహమో ||

తావిజల్లెడి మోముదమ్మి కడు వికసించె
లో వెలితి నువ్వులను లోగి లోగి
శ్రీవేంకటేశ ల క్ష్మీకాంత నినుగలసి
ఈ వైభవము లందె ఇదివో చెలియ || ||ఎటువంటి మోహమో ||

Advertisement

తాజా వార్తలు

Advertisement