Saturday, November 16, 2024

అన్నమయ్య కీర్తనలు : ఉన్నమంత్రా లిందు సరా

ఉన్నమంత్రా లిందు సరా వొగి వాచారించుకొంటే
విన్నకన్నవారి కెల్ల విష్ణునామమంత్రము || ||ఉన్నమంత్రా లిందు సరా ||

పరగ బుచ్చకాయల బరసి పోదు మంత్రము
గరిమ ముట్టంటు లేని ఘనమంత్రము
వరుసనెవ్వరువిన్నా వాడిచెడని మంత్రము
అరయ నిదొక్కటే పో హరినామమంత్రము || ||ఉన్నమంత్రా లిందు సరా ||

యెజాతివోరికైన ఎంగిలిలేని మంత్రము
వోజ దప్పితే జెడక వుండేమంత్రము
తేజాన వొకరి కిస్తే దీరిపోని మంత్రము
సాజమైనదిదే పో సత్యమైన మంత్రము || ||ఉన్నమంత్రా లిందు సరా ||

యిహము పరము దానే యియ్యజాలిన మంత్రము
సహజమైన వేదాలసారమంత్రము
బహునారదాదు లెల్ల పాటపాడిన మంత్రము
విహితమయిన శ్రీవేంటేశుమంత్రము || ||ఉన్నమంత్రా లిందు సరా ||

Advertisement

తాజా వార్తలు

Advertisement