రాగం : ఖమాస్
ఇతడే యతడు గాబోలేలిక బంటును నైరి
మితి లేని రాఘవుడు మేటి హనుమంతుడు || ||ఇతడే యతడు||
జలధి బంధించి దాటె చలపట్టిరాఘవుడు
అలరి వూరకే దాటె హనుమంతుడు
అలుకతో రావణుని యదటణచెనతడు
తలచి మైరావణుని దండించె నితడు || ||ఇతడే యతడు||
కొండ వెల్లగించె దొల్లి గోవర్థనుడతడు
కొండతో సంజీవి నెత్తె కోరి యితడు
గుండు గరచె నహల్యకొరకు సీతాపతి
గుండు గరగగ పాడె కోరి యితడు || ||ఇతడే యతడు||
అంజనాచలము మీద నతడు శ్రీవేంకటేశు
డంజనీతనయుడాయ అనిలజుడు
కంజాప్తకులరామఘనుడు తాననును దయా –
పుంజమాయ మంగాంబుధి హనుమంతుడు|| ||ఇతడే యతడు||