రాగం : ధన్యాసి
ఉప్పవడము గాకున్నా రిందరు
యెప్పుడు రేయి నీకెప్పుడు పగలు
కన్నుల చంద్రుడును కమలమిత్రుడును
వున్నతి నివి నీకుండగను
వెన్నెలయెండలు వెలయగ మేల్కొను
టెన్నడు నిద్దుర యెన్నడు నీకు
కందువ సతికనుగలువలు ముఖార
వింద ము ని దివో వికసించె
ముందర నిద్దుర మొలవదు చూచిన
విందగునీ తెలివికిదుదా యేది
తమము రాజసము తగుసాత్వికమును
నమరిన నీ మాయారతులు
కమలాధిప వేంకటగిరీశ నిన్ను
ప్రమదము మఱపును బ్తెకొనుటెట్లా