రాగం : రతిపతిప్రియ
సకల లోకేశ్వరులు సరుస చేకొనువాడు
అకలంకముగ పుష్ప యాగంబు
వివిధ పుష్పములతో వేదఘోషములతో
అవల తిరువాముడియు అంగనల ఆటతో
కవి వంది సుతలతో కమ్మ పూజలతోడ
నవధరించీ పుష్ప యాగంబు
కప్పురపుటారతేల ఘనచందనము తోడ
తెప్పల ధూపముల తిరువంది కాపుతో
ఒప్పు(గ) పణ్యారములు వొగి పెక్కువగలతో
అప్పడందీ పుష్పయాగంబు
తగు ఛ్రత చామర తాంబూలములతోడ
పగటుతో నీరీతి పది పూజలందుకొని
జిగిమీరె చూడరే శ్రీ వేంకటేశ్వరుని
అగణితంబగు పుష్పయాగంబు