రాగం : హంసానంది
ఉన్నతోన్నతుడు ఉడయవరు
ఎన్ననంతుడే ఈ ఉడయవరు
సర్వలోకముల శాస్త్ర రహస్యములు
ఉర్విపొడమె నీ ఉడయవరు.
పూర్వపు వేదాంత పుణ్య శాస్త్రములు
నిర్వహించెన న్నిట ఉడయవరు
కడిసె మోక్ష సాకారము తానై
ఉదుటున నిలిచెనీ ఉడయవరు
ఇదివో శ్రీ వేంకటేశ్వరుని ఈడై
పొదలుచున్నాడు భువిని ఉడయవరు