రాగం : శుద్ధ ధన్యాసి
సువ్వి సువ్వి సువ్వాలమ్మా
నవ్వుచు దేవకి నందను గనియె
శశి వొడచె అలసంబులు గడచె
దిశ దేవతల దిగుళ్లు విడచె
కావిరి విరసె కంసుడు గినిసె
వావిరి పువ్వుల వానలు గురిసె
గతిసేసె అటు గాడిద గూసె
కుతిలకుడిచి జనకుడు నోరు మూసె
గగురు పొడిచె లోకము విధి విడిచె
మొగులు గురియగ యమునపై నడచె
కలిజారె వేంకటపతి మీరె
ఆలమేల్మంగ నాంచారమ్మ కలుకలు తీరె