Friday, November 22, 2024

అన్నమయ్య కీర్తనలు : నందనందన వేణునాద

నందనందన వేణునాద వినోద, ము
కుంద కుంద దంతహాస గోవర్ధనధర || ||నందనందన వేణునాద||

రామరామ గోవింద రవిచంద్రలోచన
కామకామకలుష వికారవిదూర
ధామ ధామ విభవత్ప్రతాపరూప దనుజ ని –
ర్ధూమధామకర ణ చతుర భవభంజన || ||నందనందన వేణునాద||

కమల కమలావాస కమలారమణ దేవో –
త్తమ తమోగుణ సతత విదూర
ప్రమదత్ప్రమదాను భవ భావకరణ
సుముఖ సుధనాంద శుభరంజనా || ||నందనందన వేణునాద||

పరమ పరాత్పర పరమేశ్వర
వరద వరదామల వాసుదేవ
చిరచిర ఘన నగ శ్రీవేంకటేశ్వర
నరహరినామ పన్నగ శయనా || ||నందనందన వేణునాద||

Advertisement

తాజా వార్తలు

Advertisement