రాగం : అభోగి
అవుడేమనె నేమను మనెను
తపమే విరహపు తాపమనె|| ||అవుడేమనె నేమను||
పవనజ యేమనె పడతిమరేమనె
అవనిజ నిను నేమను మనెను
రవికులేంద్ర భారము ప్రాణంబనె
ఇవల నెల్ల ధరియించే ననె|| ||అవుడేమనె నేమను||
యింకా నేమనె యింతి మరేమనె
కొంకక యేమని కొసరుమనె
బొకుల దేహము పోదిది వేగనె
చింకవేట యిటు చేసెననె|| ||అవుడేమనె నేమను||
నను నేమనె ప్రాణము మన కొకటనె
తనకు నీ వలెనె తాపమనె
మనకులేశ ప్రేమపు మనకూటమి
ఘనవేంకటగిరిగంటిననె|| ||అవుడేమనె నేమను||