ఇన్నిటా నింతటా
రాగం : అభోగి
ప|| ఇన్నిటా నింతటా నిరవొకటే
వెన్నుని నామమె వేదంబాయె || ఇన్నిటా ||
చ|| నలినదళాక్షుని నామకీర్తనము
కలిగి లోకమున కలదొకటే
యిల నిదియే భజియింపగపుణ్యులు
చెలగి తలప సంజీవని ఆయె || ఇన్నిటా ||
చ|| కోరిక నచ్యుత గోవిందా యని
ధీరులు తలపగ తెరువొకటే
ఘోర దురితహర గోవర్ధనధర
నారాయణ యని నమ్మగ కలిగె || ఇన్నిటా ||
చ|| తిరువేంకటగిరి దేవుని నామము
ధరతలపగ ఆధారమిదే
గరుడధ్వజుని సుఖప్రద నామము
నరులకెల్ల ప్రాణము తానాయె || ఇన్నిటా ||