ఇహపర సాధన మీతలపు
సహజ జ్ఞానికి సతమీతలపు
సిరులు ముంగిటను జిగిదడబడగా
హరిని మరువనిది అదితలపు
సరిగాంత లెదుట సందడి గొనగా
తిరమని భ్రమయనిదే తలపు
వొడలి వయోమదముప్పతిల్లినను
అడచి మెలంగుట యదితలపు
కడగుచు సుఖదు:ఖములు ముంచినను
జడియని నామస్మరణమే తలపు
మతి సంసారపు మాయగప్పినను
అతికాంక్షజొరనిదది తలపు
గతియై శ్రీ వేంకటపతిగాచిన
సతతము నితని శరణమే తలపు