Friday, November 22, 2024

అన్నమయ్య కీర్తనలు : ఇలయును నభమును

ఇలయును నభమును నేక రూపమై
జల జగోళ్ళు జళిపించితివి

ఎడసిన నలముక హిరణ్య కశిపుని
దొడికి పట్టి చేతుల బిగిసి
కెడపి తొడలపై గిరి గొన నదుముక
కడుపు చించి కహ కహ నవ్వితివి

రొప్పుల నూర్పుల రొచ్చుల కసరులు
గుప్పుచు లాలలు గురియుచును
కప్పిన బెబ్బులి కసరుహుంకృతుల
దెప్పల వ సురల ధృతి యణచితివి

పెళ పెళ నార్చుచు బెడ బొబ్బలిడుచు
థళ థళ మెఱువగ దంతములు
ఫళ ఫళ వీర విభవ రస రుధిరమ
గుళ గుళ దిక్కుల గురియించితివి

- Advertisement -

అహోబలమున అతిరౌధ్రముతో
మహా మహిమల మలయుచును
తహ తహ మెదుపుచు తగు వేంకటపతి
యిహము పరము మాకిపుడొగితివి

Advertisement

తాజా వార్తలు

Advertisement